అతని చావు వార్త ఈ దశాబ్దపు పాపులర్ న్యూస్ అయింది..!!

By Kuladeep

ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ మరణ వార్త ఈ దశాబ్దపు అత్యధిక జనాధరణ పొందిన వార్తగా ఎంపికయింది. ఇటీవల అమెరికాకు చెందిన ఓ పత్రికా ఎడిటర్, స్థానిక టివీ ఛానెల్ సాయంతో నిర్వహించిన ఈ సర్వేలో మైఖేల్ మరణ వార్తను ఎక్కువ మంది బహుళ జనాధరణ పొందిన వార్తగా ఎంపిక చేసారు. అమెరికా మీద సెప్టెంబరు 11న జరిగిన దాడి, బరాక్ ఒబామా తొలి అమెరికా నల్ల జాతి అద్యక్షుడిగా ఎంపికవడం లాంటి వార్తలను వెనక్కు నెట్టి ఈ వార్త తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

కాగా గత జూన్ నెల 25వ తారీఖున ఈ పాప్ స్టార్ హఠాన్మరణం ప్రపంచంలోని ఎంతో మంది మంది సంగీతాభిమానులని శోకసంద్రం లో ముంచింది. ఆ తర్వాత ఆయన మరణానికి అతను వాడిన డ్రగ్సే కారణమని అందుకు భాద్యుడిగా అతని వ్యక్తిగత వైధ్యుడు డాక్టర్ ముర్రే ను విచారిస్తున్నారు. ఇంకా ఈ కేసు విచారణలో వుంది.

కాగా మైఖేల్ జాక్సన్ మరణానంతరం అతను లండన్ లో ఇవ్వనున్న షోకు రిహార్సల్స్ చేసిన వీడియోను డాక్యుమెంటరీగా రూపొందించి 'ది ఈజ్ ఇట్' పేరుతో విడుదల చెయ్యగా అది ఊహించని రీతిలో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X