200 మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమా..!!
ప్రముఖ పాప్ సింగర్ దివంగత మైఖేల్ జాక్సన్ సినిమా 'దిస్ ఈజ్ ఇట్' రికార్డు స్థాయిలో బాక్సాఫీసు వద్ద వసూలు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజా బాక్సాఫీసు రిపోర్టు ప్రకారం ఈ సినిమా వసూల్లు 200 మిలియన్ డాలర్లను మించిపోయాయి. తన చివరి లండన్ షో కోసం మైఖేల్ జాక్సన్ ప్రాక్టీసు చేసిన వీడియోలను డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా విడుదలయినప్పటినుండీ రికార్డులను బద్దలుకొడుతూ ముందుకు దూసుకుపోతోంది. 100 నిమిషాల నిడివి గల ఈ సినిమాను యుయస్ లో తొలుత రెండు వారాలు ప్రదర్శించాలని నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాత సినిమాకు వస్తోన్న ఆదరణను బట్టి డిసెంబరు తొలి వారం వరకూ కొనసాగించాలని నిర్ణయించారు.
మైఖేల్ జాక్సన్ దిస్ ఈజ్ ఇట్ హాలీవుడ్ బాక్సాఫీసు సోనీ పిక్చర్స్ అమెరికా michael jackson this is it hollywood sony pictures america


Click it and Unblock the Notifications