ఏకమైన జాక్సన్ సోదరులు, త్వరలో తెరపైకి జాక్సన్-5?

By Kuladeep

ప్రముఖ పాప్ స్టార్ దివంగత మైఖేల్ జాక్సన్ మరణానంతంరం విడిపోయిన ఆయన సోదరులు తిరిగి ఏకమయ్యి జాక్సన్-5 బ్యాండ్ ను కొనసాగించనున్నారు. 1964లో జాక్సన్ సోదరులందరూ కలసి ఏర్పాటు చేసిన ఈ బ్యాండ్ కు అప్పట్లో మంచి ఆదరణ లభించింది. జాక్సన్ సోదరులు టిటో, జర్మెయిన్, మార్లన్, మరియు మైఖేల్ లు ఈ బృందంలో భాగస్వామ్యులు.

ఈ విషయాన్ని టిటో జాక్సన్ ప్రకటించారని ది మిర్రర్ పత్రిక పేర్కొంది. లండన్ లో తన సోలో పర్ఫార్మెన్స్ అనంతరం టిటో మాట్లాడుతూ "జాక్సన్-5 ను తిరిగి మీ ముందుకు తీసుకురాబోతున్నాము, మైఖేల్ కోసం జాక్సన్ సోదరులమందరం తిరిగి ఏకమవుతున్నామని" పేర్కొన్నాడు. తన సోదరులతో పాడటాన్ని ఆశ్వాదిస్తానని, దీనికి మరెంతో కాలం పట్టదని, త్వరలోనే మీ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అధికారికంగా తమ జాక్సన్-5 బ్యాండ్ ను రద్దుచేస్తున్నట్టు వారు ప్రకటించకపోయినా 1989 తర్వాత ఈ బ్యాండ్ నుండీ ఎలాంటి ప్రదర్శనలూ రాలేదు. కానీ 1989లో నిర్వహించిన వారి చివరి షో మాత్రం రికార్డు స్థాయిలో డబ్బులు రాబట్టింది. కానీ ఈ షోలో మైఖేల్, మార్లన్ లు పాల్గొనలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X