విడుదల కాని జాక్సన్ కవిత వేలంపాటలో..
ప్రపంచానికి పాప్ మ్యూజిక్‌ని పరిచయం చేసిన వ్యక్తిగా మైఖెల్ జాక్సన్‌ని అభివర్ణిస్తారు. అలాంటి పాప్ లెజెండ్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఎంత ఆదరణ పొందాడో అందరికి తెలిసిందే. మైఖెల్ జాక్సన్ బ్రతికున్న కాలంలో విడుదలకు నోచుకోని కొన్ని గేయాలను ఆయన చనిపోయిన తర్వాత వేలం పాట నిర్వహించనున్నారు. మైఖెల్ జాక్సన్ వద్ద వ్యక్తి గత సహాయకుడుగా పని చేసిన ఆర్నాల్డ్ క్లీన్ జాక్సన్ తన చేతులతో స్వయంగా రాసిన ఎనిమిది లైన్ల సగం గేయాన్ని వేలంపాటలో పెట్టనున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంలో ఆర్నాల్డ్ క్లీన్ మాట్లాడుతూ ఈ ఎనిమిది లైన్లు కూడా కవితా రూపంలో ఉంటాయని అన్నారు. ఈ ఎనిమిది లైన్లను మైఖెల్ జాక్సన్ తన జీవితంలో బయటకు రానివ్వలేదు. ఆయన అభిమానులకు దీనిని అందించి దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఛారిటీ కార్యక్రమాలకు వినియోగించనున్నామని తెలిపారు. ఈ వేలంపాట లాస్ ఏంజిల్స్‌లో జనవరి 23న ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











