నా భర్తకు దూరమయ్యే టైంలో.. ప్రముఖ సింగర్‌తో అఫైర్.. మరణంలో కూడా.. విల్ స్మిత్ భార్య

హలీవుడ్ నటి జడా పింకెట్ స్మిత్ తన రిలేషన్‌షిప్ గురించి సంచలన విషయాలను తన భరత్ విల్ స్మిత్ ముందే బయటపెట్టారు. తాజాగా జాడా నిర్వహించే రెడ్ టేబుల్ టాక్ ఫేస్‌బుక్ షోలో ప్రముఖ సింగర్ ఆగస్ట్ అల్సినాతో ఉన్న ఆఫైర్ గురించిన వాస్తవాలను వెల్లడించారు. ఈ టాక్ షో సందర్భంగా విల్ స్మిత్, జడా పింకెట్ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకొంటూ అనేక విషయాలు పంచుకొన్నారు. వారు వెల్లడించిన విషయాలు ఇవే..

సింగర్ అగస్ట్‌తో అలా పరిచయం

సింగర్ అగస్ట్‌తో అలా పరిచయం


ఒకానొక సమయంలో విల్ స్మిత్ తాను విడిపోయే దశలో ఉన్నాం. ఆ సమయంలో నా కొడుకు జాడెన్ ద్వారా ఆగస్ట్ అల్సినాతో పరిచయం జరిగింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత రొమాంటిక్ రిలేషన్‌కు దారి తీసింది అని జాడా పింకెట్ తెలిపారు. ఆగస్ట్ అల్సినాతో నాకు పరిచయం జరిగినప్పుడు అతడి పరిస్థితి దారుణంగా ఉంది. అతడి ఆరోగ్యం క్షీణించింది. మానసికంగా బలహీనపడ్డారు. ఆ క్రమంలో సహాయపడటానికి ఆయనకు దగ్గరయ్యాను. అతడితో రిలేషన్‌షిప్‌లో ఉండగానే కొంత గందరగోళం ఏర్పడింది అని జడా పింకెట్ స్మిత్ చెప్పారు.

విల్ స్మిత్ అనుమతి అవసరం లేదనుకొన్నా

విల్ స్మిత్ అనుమతి అవసరం లేదనుకొన్నా

ఆగస్ట్ అల్సినాతో సంబంధం పెట్టుకోవడానికి విల్ స్మిత్ అనుమతి గానీ, అతడి అంగీకారం అవసరం లేదనుకొన్నాను. ఎందుకంటే అప్పటికే నేను అతడితో తెగతెంపులు చేసుకొన్నాను. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలకు మరోకరి అనుమతి అవసరం లేదని భావించాను అని జడా పింకెట్ స్మిత్ చెప్పారు.

విల్ స్మిత్ లేకుండా జీవితం లేదని

విల్ స్మిత్ లేకుండా జీవితం లేదని

విల్ స్మిత్‌తో దూరమైన తర్వాత నేను చాలా బాధను అనుభవించాను. ఆయనతో బంధాన్ని దూరం చేసుకొన్న తర్వాత నేను చాలా మానసిక క్షోభను అనుభవించాను. ఆ తర్వాత ఒకరికొకరం దూరమయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేశాం. కానీ విధి మరోటి తలచినందున అది సాధ్యపడలేదు. మా మధ్య విభేదాలను పరిష్కరించుకొని ఒక్కటయ్యాం. విల్ స్మిత్ లేకుండా నా జీవితంలో సంతోషం లేదనే విషయం నాకు బోధపడింది అని జడా పింకెట్ అభిప్రాయపడ్డారు.

మరణంలో కలిసే ఉంటాం

మరణంలో కలిసే ఉంటాం

ఫేస్‌బుక్ టాక్ సందర్భంగా జడా పింకెట్, విల్ స్మిత్ తమ బంధం బలమైందనే విషయాన్ని తమ మాటల్లో వ్యక్త పరిచారు. మేమిద్దరం ఒక్కటిగా జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తాం. చివరకు మరణంలో కూడా కలిసే ఉంటాం అని విల్ స్మిత్, జడా పింకెట్ వ్యక్తీకరించారు. ఈ టాక్ షో సందర్భంగా వారు వెల్లడించిన ప్రతీ విషయాన్ని చాలా నిజాయితీతో, నమ్మకమైన రీతిలో చెప్పడం గమనార్హం. 1997లో వివాహం చేసుకొన్న విల్ స్మిత్, జడాకు జాడెన్, విల్లో అనే ఇద్దరు సంతానం ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X