సెట్స్‌పై శృంగార సన్నివేశాలు చూసే ఓ మనిషి.. ఆయన చేసే పనేంటో తెలుస్తే షాకే!

అన్నీ ఉంటేనే సినిమా. రొమాన్స్, కామెడీ, ట్రాజెడీ, ఎమోషన్స్ ఇలా అన్నీ అంశాల మేళవింపే ఓ సినిమా. అయితే ఒక్కో సందర్భంలో పైన పేర్కొన్న అంశాలకు దర్శకుడు ఇచ్చే ప్రియారిటీని బట్టి కూడా సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ విషయం పక్కన బెడితే బాలీవుడ్ లో రొమాన్ పాళ్లు కాస్త ఎక్కువ. ఇక హాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? సినిమాతో కథతో పాటు సమ పాళ్లలో శృంగార భరితమైన సన్నివేశాలు లేనిదే ఏ సినిమా బయటకు రాదు. కాగా ఇటీవలే మొదలై సెన్సేషన్ అవుతున్న మీటు ఉద్యమ ఎఫెక్ట్ ఈ హాలీవుడ్ సినిమాలపై పడటం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.

సినీ ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక సమస్యలను మీటూ ద్వారా బయటపెడుతున్నారు నటీమణులు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తోటి నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర యూనిట్ ఇలా సినిమాకు పని చేస్తున్న వర్గం లోని వ్యక్తులపై ఎందరో నటీమణుల ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితులను చూసిన హాలీవుడ్ కింగ్ జేమ్స్ బాండ్ షేక్ అయి ఓ ఆలోచనకు రావడం హాట్ టాపిక్ గా మారింది.

James Bond conditions on the sets

ఈ నేపథ్యంలో ది గ్రేట్ జేమ్స్ బాండ్ 007 సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న 25వ సినిమా ఆన్ లొకేషన్ లోని పరిస్థితులు చూస్తే ఆశ్చర్యమేస్తోంది. అసలే హాలీవుడ్ మూవీ.. అందునా బాండ్ 007 అంటే శృంగార మేళవింపు తప్పనిసరి. అందాల భామలతో అదిరిపోయే సెక్స్ సన్నివేశాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఓవైపు సాహసాలు, మరోవైపు యాక్షన్, ఇంకోవైపు రొమాన్స్ ఇవన్నీ బాండ్ సినిమాల్లో ఉండి తీరుతాయని ఇప్పటికే రుజువైంది కూడా. కానీ ప్రస్తుతం మీటూ రాజ్యమేలుతుండటంతో ముందుగానే జాగ్రత్త పడిన బాండ్.. సెట్స్‌పై శృంగార సన్నివేశాలు చూసేందుకు ప్రత్యేకంగా కోచ్ లను పెట్టుకున్నారట.

శృంగార సన్నివేశాల్లో నటీనటుల ప్రవర్తనను పరిశీలించడమే ఈ కోచ్‌ల పని. ఒకవేళ ఎవరికైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఈ కోచ్ లకు చెప్పుకోవచ్చు. ఆ సమస్యలను అప్పుడే పరిష్కరించే విధంగా ఈ కోచ్ ల వ్యవహారం ఉంటుందట. కాస్త కొత్తగా ఆలోచించినా ఇదేదో బాగానే ఉందే అని అంటున్నారు ఈ విషయం తెలుసుకున్న జనాలు. రానున్న రోజుల్లో ఈ సంస్కారం బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ కూడా చేరుకుంటుందేమో చూడాలి మరి.

More from Filmibeat

Read more about: james bond
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X