షాకింగ్ న్యూస్.. జేమ్స్‌బాండ్ నటుడు కన్నుమూత
సినీ ప్రపంచానికి 2020 అంతగా కలిసి రాలేదు. ప్రఖ్యాత సినీ ప్రముఖు స్వర్గస్థులయ్యారు. ఇండియన సినీ సెలెబ్రిటీలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా హాలీవుడ్ ప్రఖ్యాత నటుడు సీన్ కానరీ (90) తుది శ్వాస విడిచాడు. జేమ్స్ బాండ్ సిరీస్‌లో నటించాడు. జేమ్స్‌బాండ్ 007గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు సీన్ కానరీ. ఆయన తాజాగా సీన్ కానరీ కన్నుమూశాడు.

నిద్రలోనే కన్నుమూత
గత కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురైనా సీన్ కానరి నిద్రలోనే కన్నుమూశారు. సీన్ కానీర మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జేమ్స్ బాండ్ 007 అభిమానులు శోక సంధ్రంలో మునిపోయారు. ఈ స్కాటీష్ నటుడికి ప్రపంచం మొత్తం జేమ్స్ బాండ్‌గా తమ గుండెలో స్థానం కల్పించారు.

సీన్ కానరీ నటించిన చిత్రాలు ఇవే
సీన్ కానరీ జేమ్స్ బాండ్ చిత్రమే కాకుండా డా. నో, ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్ బాల్, యు ఓన్లీ లైవ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్, నెవర్ సే నెవర్ అగైన్, లాస్ట్ క్రూసేడ్, ఇండియానా జోన్స్, ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ లాంటి సినిమాల్లో నటించాడు.

సీన్ కానరీని వరించిన అవార్డులు
1962లో డాక్టర్ నో చిత్రం ద్వారా 007గా అవతారం ఎత్తిన సీన్ కానరీ తన కెరీర్‌లో దాదాపు ఆరు సినిమాల్లో జెమ్స్‌బాండ్ పాత్రల్లో ప్రేక్షకులను మైమరిపించారు. తన కెరీర్‌లో సీన్ కానరీ ఆస్కార్ అవార్డు విజేతగా నిలవడంతో మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, రెండు బాఫ్టా అవార్డులు అందుకొన్నారు. పలు దశాబ్దాలపాటు జరిగిన ప్రేక్షకులు ఓటింగ్‌లో సీన్ కానరి ఉత్తమ జేమ్స్ బాండ్‌గా నిలిచాడు.

సీన్ కానరీకి నైట్ అవార్డు
దశాబ్దాలపాటు హలీవుడ్ చిత్రాల్లో నటించి ఉత్తమ ప్రతిభను చాటుకొన్న సీన్ కానరీని 2000 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ ఆయనను నైట్ అవార్డుతో సత్కరించింది. ఈ ఏడాది ఆగస్టు 25న సీన్ కానరీ 90వ ఏట అడుగుపెట్టాడు. కోవిడ్ కారణంగా ఆయన తన బర్త్ డేను నిరాడంబరంగా జరుపుకొన్నారు.


Click it and Unblock the Notifications











