జేమ్స్‌బాండ్ మూవీ మరోసారి వాయిదా.. నో టైమ్ టు డై రిలీజ్ ఎప్పుడంటే

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న జేమ్స్ బాండ్ చిత్రం మరోసారి వాయిదా పడింది. కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తు్న నో టైమ్ టు డై అనే చిత్ర విడుదలను వాయిదా వేసినట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌లో థియేట్రికల్ బిజినెస్ సరిగా జరగని కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్టు సమాచారం.

నో టైమ్ టు డై చిత్రంపై ఎంజీఎం, యూనివర్సల్, బాండ్ నిర్మాతలు ట్విట్టర్‌లో ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీ 2021న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. వాస్తవానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం నవంబర్ 12వ తేదీన యూకేలో, నవంబర్ 20న అమెరికాలో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కరోనావైరస్ సమయంలో అమెరికాలో రిలీజ్ వాయిదా పడిన తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.

 James Bond film No Time To Die release postponed

నో టైమ్ టు డై చిత్రంలో జేమ్స్ బాండ్ 007 పాత్రను డేనియల్ క్రెయిగ్ పోషించిన విషయం తెలిసందే. ఇంకా ఈ చిత్రంలో రామీ మాలెక్, లాషనా లించ్, అన్నా డీ ఆర్మాస్ నటించారు. ఈ చిత్రానికి క్యారీ జోజి ఫుకునాగా దర్శకుడు. ఇక నో టైమ్ టు డై చిత్రం విషయానికి వస్తే.. బాండ్ సినిమాల్లో అత్యధిక నిడివి ఉన్న చిత్రంగా రికార్డు సృష్టించబోతున్నది. ఈ చిత్రం నిడివి సుమారు 163 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంటలపాటు అని యూనిట్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X