జేమ్స్‌బాండ్ హీరోయిన్‌కు కరోనావైరస్.. ఎఫెక్ట్‌తో ఇంట్లో బందీగా

జేమ్స్‌బాండ్ హీరోయిన్, మోడల్ ఓగ్లా కురిలెంకోకు కూడా కరోనావైరస్ కష్టాలు తప్పలేదు. తాజాగా ఉక్రేయిన్‌కు చెందిన అందాల భామకు పరీక్షలు చేయించుకోగా నావెల్ కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ప్రాణాంతక వ్యాధిగా ప్రకటించిన తర్వాత అంతర్జాతీయంగా ఈ వ్యాధి బారిన పడిన తొలి సెలబ్రిటీగా ఓగ్లా కురిలెంకో పేరు బయటకు వచ్చింది. గత వారం టామ్ హంక్స్, రీటా విల్సన్ దంపతులు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.

ఈ విషయంపై ఓగ్లా స్పందిస్తూ.. గతవారంగా నేను అస్వస్థతకు గురయ్యాను. జ్వరం, తీవ్ర అలసటతో బాధపడుతూ ఉండటంతో ఆదివారం రోజున రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోన్నాను. ఆ తర్వాత పరీక్షల ఫలితాలను బట్టి పాజిటివ్ అని తేల్చారు అని ఆధివారం తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

James Bond Heroine Olga Kurylenko tested Coronavirus positive

ప్రస్తుతం నా పరిస్థితి అంత అందోళనకరంగా లేదు. కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులకు సందేశాన్ని పంపింది. కరోనా పాజిటివ్ తేలడంతో ఇంట్లో బందీగా మారిపోయానని తెలుపుతూ.. ఇంటి గేట్ ఫోటోను తన ఇన్స్‌టాలో పోస్టు చేసింది.

ఇక ఓగ్లా కురిలెంకో కెరీర్ విషయానికి వస్తే.. 2008లో వచ్చిన జేమ్స్‌బాండ్ చిత్రం క్వాంటమ్ ఆఫ్ సొలేస్, 2013లో వచ్చిన సైంటిఫిక్, ఫిక్షన్ ఓబిలివియన్ ద్వారా ప్రపంచ సినీ అభిమానుల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X