twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రిపూట లండన్ వీధుల్లో కామెడీ చేయనున్న పాత హీరో కారు..!

    By Nageswara Rao
    |

    జేమ్స్ బాండ్ సినిమాలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సీన్ కానరీ. ఎందుకంటే ఈయన నటించిన జేమ్స్ బాండ్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు నమోదుచేయడమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం జేమ్స్ బాండ్ అంటే ఇలా ఉంటాడు అనేలా ఉంటుంది ఆయన నటించిన తీరు. ఇక జేమ్స్ బాండ్ సినిమా విషయాలకు వస్తే హీరోయిన్ గురించి పెద్ద చర్చ. ఎందుకంటే జేమ్స్ బాండ్ సినిమాలో అవకాశం అంటే మామూలు మాటకాదు. ఇవన్ని పక్కన పెడితే జేమ్స్ బాండ్ కోసం ప్రత్యేకంగా కోన్ని వాహాలను తయారుచేయడం సినిమాలలో మనం చూస్తూ ఉంటాం.

    ముఖ్యంగా జేమ్స్ బాండ్ సినిమాలలో కార్లు చేసేటటువంటి విన్యాసాలు మన అందరిని ఆశ్చర్యంలో ముంచేత్తుతాయి. అలా జేమ్స్ బాండ్ సినిమాలలో నటించినటువంటి ఓకారుని ఇటీవల వేలంపాటలో పెట్టడం జరిగింది. సీన్ కానరీ రెండు సినిమాలలో ఆస్టన్ మార్టిన్ అనే లగ్జరికారుని వాడడం జరిగింది. ఆకారుని ఇటీవల వేలంపాటలో హారీ యాజ్జి అనే వ్యక్తి అత్యధికంగా 2.6మిలియన్ పౌండ్లు చెల్లించి కారుని సోంతం చేసుకున్నారు.

    ఇక ఈకారు విషయానికి వస్తే బూస్టర్స్ తోపాటు బయటకు వచ్చే విధంగా సీటు, మాయమయ్యేటటువంటి నెంబర్ ప్లేట్స్, బుల్లెట్ ప్రూప్ షీల్ట్ లాంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈకారుని కోన్నటువంటి హారీ యాజ్జి మాట్లాడుతూ అసలు ఈకారుని ఓ యూరోపియన్ కోనుగోలు చేస్తాడని అనుకున్నాను. కాని అనూహ్యాంగా నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ డబ్బు పెట్టి మరీ ఈకారుని కోనుగోలు చేయడం జరిగిందన్నారు.

    ఈకారుతో ఈరోజు రాత్రి లండన్ వీధుల్లో వీరవిహారం చేస్తానని అన్నారు. అంతేకాకుండా లండన్ వీధుల్లో ఈకారుతో కోంచెం కామెడీ కూడా చేయనున్నట్లు తెలిపారు. చాలా రోజులక్రితం కారు అయిన ఇప్పటికి మంచి కండిషన్ లోఉందని, అంతేకాకుండా ఈకారుని రెండు జేమ్స్ బాండ్ సినిమాలలో వాడడం వల్ల ఇష్టపడి మరి ఈకారుని కోనుగోలు చేయడం జరిగిందన్నారు. చివరగా ఈకారుని ఓయి లోని కారు మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచనున్నట్లు తెలిపారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X