twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    No Time To Die update: రిలీజ్‌కు ముందే రికార్డుల మోత.. మొదలైన జేమ్స్‌బాండ్ 007 ఫీవర్

    |

    ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకొనేందుకు జేమ్స్‌బాండ్ అన్ని హంగులతో సిద్ధమవుతున్నాడు. తాజా జేమ్స్‌బాండ్ మూవీ నో టైమ్ టూ డై మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ క్రమంలో సినిమా గురించి పలు విశేషాలు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం సినిమా నిడివి టాక్ ఆఫ్ ది వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. ఇంతకు ఈ సినిమా నిడివి ఎంతంటే..

    జేమ్స్ బాండ్ సినిమాల నిడివి

    జేమ్స్ బాండ్ సినిమాల నిడివి

    జేమ్స్ బాండ్ కథా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నడివి ఎక్కువగా ఉండదు. కానీ గతంలో 2015లో బాండ్ 007 పాత్రలో డేనియల్ క్రేగ్ నటించిన స్పెక్ట్రే మూవీ చిత్రం ఎక్కువ నిడివి ఉన్న చిత్రంగా అంటే 148 నిమిషాలు, అలాగే 2008లో విడుదలైన క్వాంటమ్ ఆఫ్ సొలేస్ చిత్రం అతి తక్కువ నిడివి ఉన్న చిత్రంగా సుమారు 106 నిమిషాలతో రికార్డు సృష్టించాయి.

     నో టైమ్ టూ డై రన్ టైమ్

    నో టైమ్ టూ డై రన్ టైమ్

    ప్రస్తుతం జేమ్స్ బాండ్ చిత్రాల్లో అతి ఎక్కువగా నిడివి ఉన్న చిత్రంగా నమోదైన స్పెక్ట్రే రికార్డును నో టైమ్ టూ డై అనే చిత్రం తిరగరాయబోతున్నదట. ఈ చిత్రం నిడివి సుమారు 163 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంటలపాటు ఈ సినిమా రన్ ఉంటుందనేది స్పష్టమైంది. కానీ ఈ సినిమా నిడివి విషయంపై యూనివర్సల్ పిక్చర్స్ ధృవీకరించలేదు.

    తక్కువ వయసులో గాయనిగా

    తక్కువ వయసులో గాయనిగా

    ఇక నో టైమ్ టూ డై చిత్రానికి సంబంధించి మరో విశేషమేమిటంటే.. బిల్లీ ఇలీష్ అనే గ్రామీ అవార్డు విన్నర్ ఓ పాటను పాడారు. ఈ సింగర్ వయసు కేవలం 18 సంవత్సరాలు కావడం మరో విశేషం. జేమ్స్ బాండ్ సినిమా కోసం పనిచేసిన అతి తక్కువ వయసు ఉన్న ఆర్టిస్టుగా బిల్లీ ఐలీష్ ఘనతను సాధించింది. ఇటీవల బిల్లీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పాట విస్తృతంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకొన్నది.

    Recommended Video

    James Bond Hero Daniel Craig Couple Have A Baby Girl | Filmibeat Telugu
    ఇండియాలో రిలీజ్ ఎప్పుడంటే..

    ఇండియాలో రిలీజ్ ఎప్పుడంటే..

    ఇక నో టైమ్ టూ డై సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. మార్చి 31న ఇంగ్లాండ్‌లో, ఏప్రిల్ 8వ తేదీన ఆస్ట్రేలియాలో, ఏప్రిల్ 10న అమెరికాలో రిలీజ్ కానున్నది. ఇండియాలో బాండ్ సినిమాలకు ఉన్న ఆదరణ బట్టి ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో డేనియల్ క్రేగ్ సరసన రామీ మాలేక్ నటిస్తుండగా.. బెన్ విషా విలన్‌గా, లీ సెడక్స్, నోమీ హ్యారీస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    James bond 007's No Time To Die: New Daniel Craig film going to be longest run time in Bond film history. This movie run time will be 163 minutes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X