మహేశ్ కోసం అవతార్, జురాసిక్ పార్క్ డైరెక్టర్లు.. హాలీవుడ్ షేక్ అయ్యేలా రాజమౌళి ప్లాన్‌

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లలో సినిమాలు రావాలని వాళ్ల వాళ్ల అభిమానులతో పాటు సినీ ప్రియులంతా కోరుకుంటున్నారు. అలాంటి వాటిలో కొన్ని మాత్రం ఇప్పటికే రంగంలోకి దిగిపోయాయి. మరికొన్ని మాత్రం ఓకే అయి ఉన్నాయి.

అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి కలయిక ఒకటి. ఎంతో మంది ఆశలను నిజం చేస్తూ వీళ్లిద్దరూ సినిమా చేయబోతున్నారు. ఇంకా షూటింగ్ మొదలు కాకపోయినా దీని గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'హాలీవుడ్' న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీరే చూడండి!

James Cameron and Steven Spielberg will Announce Rajamouli and Mahesh Babu Movie

మహేశ్ - రాజమౌళి సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రాజమౌళి సినిమా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్​గా, కమల్ కన్నన్ వీఎఫ్ఎక్స్ సూపర్​వైజర్​గా, తమ్మి రాజు ఎడిటర్​గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్​గా వ్యవహరిస్తున్నారు.

James Cameron and Steven Spielberg will Announce Rajamouli and Mahesh Babu Movie

భారీ అంచనాలతో పుకార్లు: మహేశ్ బాబు - రాజమౌళిది ఎంతో ప్రతిష్టాత్మకమైన కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఫలానా స్టార్ నటిస్తున్నారని, ఈ సినిమా కథ అలా ఇలా ఉండబోతుందని, ఇలా ఎన్నో రకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

James Cameron and Steven Spielberg will Announce Rajamouli and Mahesh Babu Movie

స్టోరీ బాధ్యత ఆయనకిచ్చి: సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి చేస్తున్న ప్రాజెక్టు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై పని చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే స్క్రిప్టును పూర్తి చేసినట్లు ఆయనే స్వయంగా వివరించారు.

James Cameron and Steven Spielberg will Announce Rajamouli and Mahesh Babu Movie

అడ్వెంచరస్ స్క్రిప్టుతోనే: హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు స్టోరీ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రాన్ని చాలా మంది ఇండియానా జోన్స్‌తో పోల్చుతున్నారు.

James Cameron and Steven Spielberg will Announce Rajamouli and Mahesh Babu Movie

ఆరోజునే ప్రకటిస్తారంటూ: మహేశ్ బాబు.. ఎస్ఎస్ రాజమౌళి సినిమాకు సంబంధించిన అటు హీరో, ఇటు దర్శకుడు ఇద్దరూ ప్రకటించారు. కానీ, చిత్ర యూనిట్ నుంచి మాత్రం అధికారిక కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. దీంతో అసలు ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దీన్ని ఏప్రిల్ 9వ తేదీన అనౌన్స్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

James Cameron and Steven Spielberg will Announce Rajamouli and Mahesh Babu Movie

హాలీవుడ్ డైరెక్టర్ల సాయం: రాజమౌళి - మహేశ్ బాబు సినిమాపై హాలీవుడ్ ఫోకస్ పడేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఏప్రిల్ 9న అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్, జురాసిక్ పార్క్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేయించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజమౌళి కొడుకు కార్తికేయ వాళ్లతో చర్చించినట్లు తెలిసింది. అదే జరిగితే హాలీవుడ్ షేక్ అవడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X