Avatar 3: అవతార్ ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా.. టైటిల్, రిలీజ్ డేట్ వివరాలివే!
ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే హాలీవుడ్ నుంచి రూపొందే సినిమాలకు కాసింత ఎక్కువ రెస్పాన్స్ లభిస్తుంటుంది. ముఖ్యంగా హై రేంజ్ విజువల్స్, ఫుల్ లెంగ్త్ టెక్నాలజీ, భారీ బడ్జెట్‌తో మరో ప్రపంచానికి తీసుకు వెళ్లేలా తెరకెక్కే ఈ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వస్తోంది. అందుకే ఆ తరహా మూవీలకు కలెక్షన్లు భారీ స్థాయిలో రాబడుతోన్నాయి.
వరల్డ్ వైడ్‌గా అన్ని దేశాలతో పాటు ఇండియాలో కూడా హాలీవుడ్ చిత్రాలకు ఇంకాస్త ఎక్కువ రెస్పాన్స్ వస్తుంటుంది. ఇలా ఎన్నో ఫ్రాంచైజీల్లో సినిమాలు వచ్చి సత్తా చాటాయి. అలాంటి వాటిలో 'అవతార్' (Avatar) ఒకటి. 2009లో ఇదే పేరుతో ఒక సినిమా వచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

'అవతార్' ఫస్ట్ పార్ట్ భారీ సక్సెస్ అవడంతో దీనికి కొనసాగింపుగా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' సినిమాను తెరకెక్కించారు. ఇది కూడా మంచి ఆదరణను అందుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ మూవీ రెండు బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 16423 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి.
కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వచ్చిన 'అవతార్' ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు చిత్రాలూ సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వీటికి సీక్వెల్‌గా మూడో మూవీని కూడా రూపొందిస్తున్నారు. జేమ్స్ కామెరాన్ రూపకల్పనలో ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా తాజాగా వచ్చేసింది.
తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ అవతార్ 3 టైటిల్‌ను రివీల్ చేశారు. దీనికి 'అవతార్- ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire and Ash) అనే పేరు పెడుతున్నట్లు చెప్పారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని 2025 డిసెంబర్ 19న విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం కోసం వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్ వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ రూపకల్పనలో రాబోతున్న 'అవతార్- ఫైర్ అండ్ యాష్' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అలాగే, త్వరలోనే ప్రచార చిత్రాలను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











