6500 కోట్లతో అవతార్ సీక్వెల్స్.. ఒకటి కాదు నాలుగు.. కామెరాన్ సంచలనం

సంచలన దర్శకుడు జేమ్స్ కామెరాన్ మరో అద్బుత ప్రయోగానికి పూనుకొన్నాడు. ఒకేసారి ఏకకాలంలో నాలుగు అవతార్ చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు.

By Rajababu

సంచలన దర్శకుడు జేమ్స్ కామెరాన్ మరో అద్బుత ప్రయోగానికి పూనుకొన్నాడు. ఒకేసారి ఏకకాలంలో నాలుగు అవతార్ చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. చాలా ఏళ్లుగా వాయిదా పడిన ఈ అవతార్ సీక్వెళ్లకు తాజాగా ముహూర్తం కుదిరింది.

 ఏకకాలంలో నాలుగు అవతార్లు..

ఏకకాలంలో నాలుగు అవతార్లు..

ఆర్థిక ఇబ్బందులు, నటీనటుల ఎంపిక, ఇతర కారణాల వల్ల అవతార్ సీక్వెల్‌కు అవంతరాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం అన్ని సర్దుకోవడంతో అవతార్ 2, అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5 చిత్రాలను ఏకకాలంలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు జేమ్స్ కామెరాన్. ఈ చిత్ర బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే సినిమా వ్యయం 6550 కోట్లు కావడం విశేషం. ఈ చిత్రాల షూటింగ్ ఇటీవలే అమెరికాలోని మన్ హట్టన్ బీచ్‌లో ప్రారంభించారు.

1600 కోట్లతో అవతార్ 1

1600 కోట్లతో అవతార్ 1

అవతార్1 చిత్రం అప్పట్లో సుమారు 1600 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. ఆ కాలంలో అదే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రం. ఆ తర్వాత 400 మిలియన్ డాలర్లతో పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ చిత్రం రూపొందింది.

చరిత్రను తిరగరాసి

చరిత్రను తిరగరాసి

2009లో ప్రపంచ సినీ అభిమానులను ఉర్రూతలూగించిన చిత్రం అవతార్. 3డీలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో అత్యధిక వసూళ్లను సాధించి ప్రపంచ సినిమా రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 20 వేల కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. తాను రూపొందించిన టైటానిక్, స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్ చిత్రాల రికార్డులను అధిగమించింది.

హాలీవుడ్‌లో కొత్తేమీ కాదు..

హాలీవుడ్‌లో కొత్తేమీ కాదు..

ఏకకాలంలో పలు సీకెల్స్‌ను రూపొందించడం హాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. దర్శకుడు పీటర్ జాక్సన్ మూడు లార్డ్ ఆఫ్ ది రింగ్స్, హాబిట్ మూవీలను తెరకెక్కించారు. అయితే వాటి విడుదలలో పెద్దగా కాల వ్యత్యాసం లేకపోవడం గమనార్హం.

నటీనటులు వీరే..

నటీనటులు వీరే..

అవతార్ సీక్వెల్స్‌లో భారీ సంఖ్యలో తారాగణాన్ని ఎంపిక చేశారు. సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టిఫాన్ లాంగ్, సీగ్నొర్ని వీవర్ ‌తోపాటు క్లిఫ్ కర్టీస్, ఓనా చాప్లిన్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X