చైనా 3డి సినిమాకి 'అవతార్' డైరెక్టర్ సహాయం
హాలీవుడ్‌లో టైటానిక్, అవతార్ లాంటి బాక్సాఫీసు రికార్డుల సినిమాలన్ని తెరకెక్కించిన జెమ్స్ కెమెరూన్ త్వరలో పురాతన చైనీస్ వ్యూహాకర్త, తత్వవేత్తలకు సంబంధించిన 3డి సినిమా 'ది ఆర్ట్ ఆఫ్ వార్' కి తన వంతు దర్శకత్వ సహాయాన్ని అందించనున్నారు. ఈ సందర్బంలో బీజింగ్‌లో ఏప్రిల్ 23-28 నుండి జరగనున్న రెండవ బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పండుగలో జెమ్స్ కెమెరూన్ పాల్గోననున్నారనే విషయాన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు.
జెమ్స్ కెమెరూన్ టెక్నికల్ బృందం ఈ పండుగ సందర్బంగా జరగనున్న షూటింగ్ భాగానికి టెక్నికల్ సపోర్ట్‌ని అందించున్నారని అన్నారు. 'ది ఆర్ట్ ఆఫ్ వార్' సినిమా నిర్మాణానికి గాను సుమారు $80 నుండి $100 వరకు ఖర్చు అవతుందని అంచనా వేశామన్నారు. ఈ ఫెస్టివల్‌లో జెమ్స్ కెమెరూన్ చైనీస్ ఫిల్మ్ మేకర్స్‌తో చర్చిం తదుపరి ప్లాన్స్‌ని రూపకల్పన చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి చైనీస్ సూపర్ హీరో కీను రీవ్స్ కూడా హాజరుకానున్నారు. జెమ్స్ కెమెరూన్ 1997లో రూపొందించిన టైటానిక్ సినిమా విడుదలైన ఆరు రోజుల్లో సుమారు $67 మిలియన్ల గ్రాస్‌ని కలెక్ట్ చేయగా... అదే నార్త్ అమెరికాలో పది రోజులకు గాను $36 మిలియన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











