క్రిస్టమస్ 2014 లేక 2015న ఆసినిమాకి సీక్వెల్స్ విడుదల
ప్రపంచం మొత్తం గర్వించదగ్గ దర్శకులలో మొట్టమొదటి ఉండేవారు జేమ్స్ కామెరూన్. ఈయన తీసినటువంటి సినిమాలు అధ్బుతాలు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ సినిమాలు టైటానిక్ మరియు గత సంవత్సరం విడుదలై అవార్డులు మరియు రివార్డులను సంపాదించి పెట్టడమే కాకుండా బాక్సాఫీసు వద్ద వసూళ్శను రాబట్టినటువంటి సినిమా అవతార్. అలాంటి అవతార్ సినిమాకి సీక్వెల్స్ నిర్మించడానికి సిద్దంగా ఉన్నానని చాలా సందర్బాలలో జెమ్స్ కామెరూన్ చెప్పడం జరిగింది.
ఎంటర్టైన్మంట్ వీక్లీ వార్త కధనాల ప్రకారం జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమాకి రెండు సీక్వెల్స్‌ని రూపోందించి 3డిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ ఈసీక్వెల్స్‌ని రూపోందించే పనిలో ఉన్నారు. అన్ని పూర్తి చేసి 2014, 2015లలో విడుదల చేయాడానికి సన్నాహాలు చేసుకుంటునట్లు సమాచారం. ఈసందర్బంలో జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలాగైనా సరే అనుకున్న టైమ్‌కి పూర్తి చేసి క్రిస్ట్ మస్ 2014 లేక 2015న విడుదల చేయగలిగేటట్లు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక అవతార్ సినిమాలో చివరి వరకు ఏఏ క్యారెక్టర్స్ బ్రతికి ఉన్నాయో అవే క్యారెక్టర్స్ తిరిగి అవతార్ సీక్వెల్స్‌లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు.


Click it and Unblock the Notifications











