అవతార్ 2: ఈ సారి పూర్తి డిఫరెంటుగా... వీడియో షేర్ చేసిన జేమ్స్ కామెరూన్!
Recommended Video

2009లో వచ్చిన 'అవతార్' ప్రపంచ వ్యాప్తంగా ఓ సంచలనం. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అండ్ టీమ్ గత కొన్నేళ్లుగా అవతార్ సీక్వెల్స్ తీసే పనిలో బిజీగా ఉన్నారు. సెకండ్ పార్ట్ రావడానికి దాదాపు 10 ఏళ్ల సమయం తీసుకున్నప్పటికీ అవతార్ 2, అవతార్ 3 సిరీస్‌లు వెంట వెంటనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
'అవతార్'లో మనం పండోరా అనే గ్రహంలోని ఉన్న వింత జీవులను చూశాం. అయితే అవతార్ పార్ట్ 2, పార్ట్ 3 చిత్రాలు ఇందుకు భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ రెండు పార్టుల షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఓ వీడియో విడుదల చేశారు.
వీడియో రిలీజ్ చేసిన కామెరూన్
అవతార్ సీక్వెల్స్ షూటింగ్ పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ మిగిలి ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు అంటూ.... కామెరూన్ తన వీడియోలో వెల్లడించారు.

ఎలీటా: బాటల్ ఏంజెల్
అవతార్ 2... ‘ఎలీటా' అనే అమ్మాయి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందని కామెరూన్ తాజాగా విడుదల చేసిన వీడియో బట్టి తెలుస్తోంది. బాటల్ ఏంజెల్ అంటూ ఆమెను పేర్కొనడాన్ని బట్టి ఇందులో ఎలీటా యుద్ధం చేసే వనితగా కనిపిచబోతోంది. ఎలీటా యాక్షన్ విన్యాసాలు ప్రేక్షకులను అబ్బుర పరచనున్నాయి.

ఇదో కొత్తరకమైన అవతార్
మొదటి పార్టులో పండోరా గ్రహంలో కొత్త కొత్త అవతారాన్ని చూపించిన జేమ్స్ కామెరూన్....ఈ సారి తన సీక్వెల్‌లో ‘ఎలీటా' అనే పాత్ర ఎలా అవతరించింది అనే కథ ఆసక్తికరంగా చెప్పబోతున్నాడట.

14 విడుదల ఎప్పుడు?
ఫిబ్రవరి 14న ఈ చిత్రానికి సంబంధించిన తొలి ట్రైలర్ విడుదల కాబోతోంది. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











