'అవతార్'సీక్వెల్స్ గురించి దర్శకుడు
వాషింగ్టన్ : సూపర్‌హిట్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'అవతార్'కు త్వరలో రెండు సీక్వెల్స్ రాబోతున్నాయి. అవతార్ సినిమా రెండు, మూడు భాగాల స్క్రిప్ట్‌ను తాను తయారుచేస్తున్నానని, రెండు భాగాల షూటింగ్‌ను ఒకేసారి వచ్చే ఏడాది చివరలో ప్రారంభిస్తామని దర్శకుడు జేమ్స్ కామరన్ చెప్పారు. మొదటిభాగం స్క్రిప్ట్‌ను పక్కాగా తయారుచేయకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్‌లో చాలా సీన్‌లు కట్ చేయవలసి వచ్చిందని తెలిపారు. అయితే రెండు, మూడు భాగాలలో అలా జరగకుండా చూడాలనుకుంటున్నానని చెప్పారు. ఇక తన కెరీర్‌లో కేవలం అవతార్ సినిమాలు మాత్రమే తీస్తానని, అవతార్ నాలుగోభాగం కూడా తీసే అవకాశముందని అన్నారు. ఇకనుంచి ఇతరుల కథలతో సినిమాలు తీయబోనని తెలిపారు. ఏ కథనయినా అవతార్ పరిధిలోనే తీయొచ్చని చెప్పారు.
''ఇక మీదట బయటి నిర్మాతల సినిమాల్ని చేయను. నా మిగతా సినీ కెరీర్ మొత్తం 'అవతార్' సీక్వెల్స్ తీయడానికే వినియోగిస్తా. 'అవతార్-2', 'అవతార్-3' ప్రస్తుతం నా మనసులో ఉన్నాయి. వీలైతే 'అవతార్-4' కూడా వచ్చే అవకాశం ఉంది''అని చెప్పారు. ఇక అవతార్ సినిమాలో చివరి వరకు ఏఏ క్యారెక్టర్స్ బ్రతికి ఉన్నాయో అవే క్యారెక్టర్స్ తిరిగి అవతార్ సీక్వెల్స్‌లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు.
పండోరా గ్రహ నేపథ్యంలో సైన్స్-ఫిక్షన్ తరహా కథతో కళ్లు చెదిరే సాంకేతిక హంగులతో దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు కొనసాగింపు సినిమాల్ని తీయబోతున్నానని కామెరాన్ ప్రకటించారు. ఎంటర్టైన్మంట్ వీక్లీ వార్త కధనాల ప్రకారం జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమాకి రెండు సీక్వెల్స్‌ని రూపోందించి 3డిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ ఈసీక్వెల్స్‌ని రూపోందించే పనిలో ఉన్నారు. అన్ని పూర్తి చేసి 2014, 2015లలో విడుదల చేయాడానికి సన్నాహాలు చేసుకుంటునట్లు సమాచారం. ఈసందర్బంలో జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలాగైనా సరే అనుకున్న టైమ్‌కి పూర్తి చేసి క్రిస్ట్ మస్ 2014 లేక 2015న విడుదల చేయగలిగేటట్లు నిర్ణయం తీసుకున్నామన్నారు.


Click it and Unblock the Notifications











