SS Rajamouli ఎస్ఎస్ రాజమౌళిపై జేమ్స్ కామెరాన్ ప్రశంసలు.. ప్రపంచ సినిమా రంగంపై..!
ఇండియన్ సినిమా ప్రతిష్ట అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చనీయాంశమవుతున్నాయి. గత కొద్దికాలంగా బాహుబలి, RRR లాంటి సినిమాలు హాలీవుడ్ ప్రముఖులను ఆకర్షిస్తున్నాయి. అందుకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం అకర్లేదు. అయితే తాజాగా అమెరికాలో జరిగిన సాటర్న్ అవార్డు కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ స్పందిస్తూ జక్కన్నపై ప్రశంసలు కురిపించారు. ఆ వివరాల్లోకి వెళితే..
బాహుబలి చిత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు హాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన RRR కూడా హాలీవుడ్ సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకోవడం తెలిసిందే.

ఇక RRR చిత్రం ఆస్కార్ అవార్డుల్లోనే కాకుండా పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం మ్యూజిక్ కేటగిరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఎంపికై చరిత్ర సృష్టించింది. దాంతో ఇండియన్ సినిమా ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పింది. రాజమౌళిపై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా అమెరికాలో సాటర్న్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల కోసం జేమ్స్ కామెరాన్ నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై జేమ్స్ కామెరాన్ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. అద్బుతమైన టెక్నాలజీతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు అని అన్నారు.
ఇండియా సినిమా ప్రపంచవేదికలపై బ్లాస్ అవుతున్నది. ఇది చాలా మంచి పరిమాణం. భారతీయ సినిమా పరిశ్రమ ఎదుగుదల చాల గ్రేట్‌గా ఉంది. రాజమౌళి పనితీరు అద్బుతంగా ఉంది. ఆ విషయంలో అందరూ ప్రశంసించాల్సిందే అని కామెరాన్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జేమ్స్ కామెరాన్ ప్రశంసలకు RRR టీమ్ స్పందించింది. దిగ్గజ దర్శకుడి ప్రశంసలు మాలో మరింత స్పూర్తిని రగలించింది. ఇంకా మంచి సినిమాలు, గొప్ప సినిమాలు అందించేందుకు ప్రయత్నిస్తాం. ఇండియన్ సినిమా అన్ని సరిహద్దులను చెరిపేసి.. పూర్తిస్థాయిలో అభివృద్ది ,చెందుతుందని భావిస్తున్నాం అని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











