మాటల్లోనే కాదు చేతల్లో కూడా తనేంటో చూపిన స్టార్ దర్శకుడు
అవతార్ సినిమాతో పర్యావరణం ఆవస్యకతను ప్రపంచం మొత్తానికీ చాటిచెప్పిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ సినిమాలతో నీతులు వల్లించడమే కాదు అవసరమయితే తను కూడా అందుకోసం పోరాడతానని చాటిచెప్పాడు. అవతార్ సినిమా ప్రమోషన్ నిమిత్తం ప్రస్తుతం బ్రెజిల్ దేశంలో వున్న ఈ సినిమా యూనిట్ సభ్యులు అక్కడ చెట్లు నాటడం వంటి పర్యావరణపరిరక్షణా చర్యలతో బిజీబిజీగా తమ సినిమాను ప్రమోట్ చేస్తూనే పర్యావరణాన్ని పరిరక్షించండని ప్రచారం చేస్తున్నారు.
దర్శకుడు కామెరూన్, సైంటిస్టు పాత్రలో అలరించిన సిగోర్నీ వీవర్ పనిలోపనిగా అక్కడ అమెజాన్ నది మీద నిర్మితమవుతున్న థార్మిక విద్యుత్ కేంద్రానికి వ్యతిరేఖంగా పోరాడాలని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని వాదిస్తున్న సైంటిస్టులకు వారు బాసటగా నిలిచారు.
అవతార్ జేమ్స్ కామెరూన్ సిగోర్నీ వీవర్ హాలీవుడ్ బ్రెజిల్ avatar james cameron sigourney viewer hollywood brazil


Click it and Unblock the Notifications