twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గే’ అంటే... ఫీల్ కానంటున్న హీరో

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: 'రైస్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' అనే చిత్రం ఆ మధ్య తెలుగులో 'నర వానర విప్లవం' పేరుతో అనువాదం అయి విడుదలైన సంగతి తెలిసిందే. ఫాక్స్ స్టూడియో నిర్మించిన ఈ చిత్రంలో జేమ్స్ ఫ్రాంకో హీరోగా నటించగా, స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం ఫ్రిదా పింటో హీరోయిన్ గా నటించింది.

    తాజాగా ఈచిత్ర హీరో జేమ్స్ ఫ్రాంకో ఆ సక్తికరమైన స్టేట్ మెంటుతో వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఎవరైనా అతన్ని 'గే' అని భావిస్తే ఆయన అస్సలు బాధ పడడట. అలా అని ఆయన నిజంగానే 'గే' అనుకుంటే పొరపాటే. ఆయనపై ఇలాంటి రూమర్లు ఇప్పుడు కాదు... హైస్కూల్ రోజుల నుంచే ఉన్నాయట. అలా ఆ రూమర్లు విని విని అలవాటయిపోయిందని అంటున్నాడు జేమ్స్ ఫ్రాంకో.

    హైస్కూల్ రోజుల్లో జేమ్స్ ఫ్రాంకో తన స్నేహితుడితో చాలా క్లోజ్ గా ఉండే వాడు. అదే విధంగా ఆడవాళ్లతో మాట్లడటానికి కాస్త మొహమాట పడేవాడు. దీంతో స్కూల్ లోని కొందరు గర్ల్స్ ఆయనపై 'గే' రూమర్ పుట్టించారట. ఈ విషయాన్ని ఇటీవల ఎంటీవీ న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు జేమ్స్ ప్రాంకో.

    జేమ్స్ ఫ్రాంకో 2002లో వచ్చిన స్పైడర్ మేన్ చిత్రంలో కూడా నటించాడు. ఈ సినిమాలో హీరో పీటర్ పాత్రకు స్నేహితుడిగా హారీ అస్బార్న్ పాత్రలో జేమ్స్ ఫ్రాంకో నటించాడు. ప్రస్తుతం జేమ్స్ ఫ్రాంకో దిస్ ఈజ్ ది ఎండ్, లవ్ లేస్, చైల్డ్ ఆఫ్ గాడ్, హోం ఫ్రంట్ అనే హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    James Franco told MTV News "In high school these girls got mad at me and so they spread this rumor that I was having a gay relationship with one of my closest friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X