62 ఏళ్ల వయసులోనూ...బాండ్ గర్ల్ బికినీ ఫోజు(ఫోటో)
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి జేన్ సీమర్ 62 ఏళ్ల వయసులోనూ తనలో గ్లామర్ పాళ్లు తగ్గలేదని చాటిచెప్పే ప్రయత్నం చేసింది. ఈ వయసులో ఆమె బికినీతో ఫోటోషూట్లో పాల్గొంది. జేన్ సీమర్ 62వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె డిజైనర్ ఫ్రెండ్ చేరి ఇంగ్లీ ప్రత్యేకంగా బికినీని డిజైన్ చేసింది.
ఆమె బాడీకి సరిపోయే ప్రత్యేకమైన బికినీలో కాలిఫోర్నియా, మాలిబులోని తన ఇంటి బయట బీచ్‌లో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ వృద్ద సుందరి అందాలను కెమెరాల్లో బంధించింది మరెవరో కాదు....ఫోటోగ్రాఫర్ అయిన ఆమె కొడుకు సీన్ ప్లైన్ అంటూ కాంటాక్ట్ మ్యూజిక్ వెబ్ సైట్ వెల్లడించింది.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మేగజైన్ 'హలో' కూడా జేన్ సీమర్ బికినీ ఫోటోను ప్రచురించింది. ఈ వయసులో నా ఫ్రెండ్ చేరి తనకు బికినీ గిఫ్ట్ అంటే జోక్ అనుకున్నాను. కానీ వారి కోరిక మేరకు ట్రై చేసాను. అది కూడా ఎలాంటి మేకప్ లేకుండానే అంటూ జేన్ సీమర్ తెలిపింది.
జేన్ సీమర్ 1973లో వచ్చిన జేమ్స్ బాండ్ మూవీ 'లైవ్ అండ్ లెట్ డై', సమ్ వేర్ ఇన్ టైం(1980), ఈస్ట్ ఆప్ ఈడెన్(1981) చిత్రాల్లో నటించింది. ఎమ్మీ అవార్డుతో పాటు, రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, స్టార్ ఆన్ ది హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ పురస్కారాలు జేన్ సీమర్ దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











