మైఖెల్ జాక్సన్ పేరుని ఆమె చెల్లి పోగోడుతుందా..!
ప్రపంచ పాప్ సంగీతానికి రారాజు అయినటువంటి మైఖెల్ జాక్సన్ చెల్లిగా జానెట్ జాక్సన్ అందరికి సుపరిచితం. మైఖెల్ జాక్సన్ తో సమానంగా డాన్స్ వేయగల సత్తా జానెట్ జాక్సన్ కు ఉందని అందరూ అంటుంటారు. మైఖెల్ జాక్సన్ బ్రతికున్నంత కాలం ఎప్పుడూ వార్తలోకెక్కారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్దానాన్ని తన సహొదరైనటువంటి జానెట్ జాక్సన్ కూడా స్వీకరిస్తున్నారు.
ప్రస్తుతం జానెట్ జాక్సన్ తన కొత్త బాయ్ ప్రెండ్ బిలియనీర్ 'విస్సమ్ ఏఐ మానా' తో ప్రేమాయణం సాగిస్తుంది. జానెట్ జాక్సన్ అతనితో కలవడానికి బాగా ఇష్టపడుతుందని వేగుల చెప్తున్నారు. అంతేకాకుండా వెస్ట్ ఎయిత్ స్టీట్ లో వీరు సృష్టించేకోలాహాలం అంతా ఇంతా కాదంటున్నారు. వీరిద్దరూ విడిగా ఒక కార్నర్ టేబుల్ తీసుకోని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. తర్వాత వారంలో పారిస్ లో జరగబోయే ఫ్యాషన్ వీక్ నుంటి మరలా ఎప్పుడు తిరిగివస్తావని బాధతో జానెట్ జాక్సన్ తో మాట్లాడుతున్నారని అన్నారు.
జానెట్ జాక్సన్ వాళ్శ అన్నయ్య మైఖేల్ జాక్సన్ చనిపోయిన రోజుని పురస్కరించుకోని జానెట్ జాక్సన్ కు 'విస్సమ్ ఏఐ మానా' గ్రాండ్ గా ఈ ఎండాకాలంలో సర్దినియాలో పెద్ద పార్డిని ఏర్పాటుచేస్తున్నారని సమాచారం. ఏఐ మానా రిటైల్ అనే కంపెనీకి విస్సమ్ ఏఐ మానా డైరెక్టర్. అంతేకాకుండా సాక్స్ ఫిఫ్తొ అవెన్యూ స్టోర్స్ (దుబాయి)లో షేర్ హాల్డర్ కూడా. హాలీవడ్ లో వీరిద్దరి ప్రేమాయణం పై చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈసారి జానెట్ జాక్సన్ చూసి చూసి మంచి బిలియనీర్ ని పట్టిందని అందరూ గుసగుసలు ఆటుకుంటున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ చాలా కాలం నుండి డేటింగ్ లో పాల్గోంటున్నారని సమాచారం. ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ తారా స్దాయికి చేరిందని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











