జానెట్ జాక్సన్ మైఖేల్ మరణానంతరం పత్రికలే చదవటం లేదట
దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ సోదరి జానెట్ జాక్సన్ తన సోదరుడి మరణానాతరం పత్రికలు చదవటం ఆపేసిందట. అటేంటి అనుకుంటున్నారా తన సోదరుడి మరణంతో ఎంతో బాధలో వున్న తనని పత్రికల్లో వస్తున్న ఊహాగానాలు ఇంకా బాధిస్తున్నాయట. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్వయంగా ఆమే తెలిపింది.
తాను కనీసం వార్తలు కూడా చూడటం లేదని, తన చీఫ్ ద్వారా జరుగుతున్న విషయాలపై ఆరా తీస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆమె తన సోదరుడితో వున్నప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. తన తల్లి దూరంగా వున్నప్పుడు తన అన్నకు చేసిన సేవలను మననం చేసుకున్నారు. మైఖేల్ భౌతికంగా ఇక్కడ లేకపోయినా అందరి హృదయాల్లో నిలిచి వున్నాడని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











