పదేళ్లుగా ఒకే అండర్ వేర్ వాడుతున్న నటుడు.. షాకింగ్ కారణంతో సీక్రెట్ రివీల్!
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అనే సామెత తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్. కొందరి విచిత్ర చేష్టల వల్ల ఆ సామెత వచ్చిందని అంటారు. తాజాగా అది మన నోటి వెంట పలికించేలా చేశాడు ఓ నటుడు. విచిత్రమైన కోరికలు, ఆచారాలు, అభిప్రాయాలు ఉండటం సాధారణమే. అది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉంటుంది. అయితే తాజాగా ఓ నటుడు పదేళ్లుగా ఒకే అండర్ వేర్ వాడినట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎటాక్ ఆన్ టైటాన్ (Attack On Titan) అనే యానిమేషన్ సిరీసులో ఎరెన్ ఈగర్ పాత్ర చాలా పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్యారెక్టర్ కు జపనీస్ యాక్టర్ కమ్ సింగర్ యుకీ కాజీ (Yuki Kaji) తన వాయిస్ అదిరిపోయేలా చేసింది. దీంతో ఆ పాత్ర మరింత ఫేమస్ అయింది. అయితే తాజాగా ఓ టీవీ షోలో ఇంటర్వ్యూకు హాజరైనా నటుడు, సింగర్ యుకీ కాజీ తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.

ఎటాక్ ఆన్ టైటాన్ యానిమేషన్ సిరీస్ అభిమానుల్లో భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుందన్న విషయం తెలియగానే అభిమానులంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ సిరీస్ కు సంబంధించి మెమరబుల్ మూమెంట్స్ పంచుకున్నాడు నటుడు యుకీ. ఎరెన్ ఈగర్ పాత్రకు వాయిస్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇంటెన్స్ సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పాడు. దీంతో ఒక్కోసారి రికార్డింగ్ ఆపాల్సి వచ్చేదని తెలిపాడు.
ఇక ఎటాక్ ఆన్ టైటాన్ సిరీస్ ను పదేళ్ల కిందట ప్రారంభించారు. అప్పుడు తన పాత్రకు వాయిస్ ఇస్తున్నప్పుడు ఒకే జత అండర్ వేర్ ధరించినట్లుగా యుకీ కాజీ తెలిపాడు. ఫస్ట్ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ కలిగిన అండర్ వేర్ ధరించగా.. రెండో ఎపిసోడ్ కు కూడా యాదృచ్ఛికంగా అదే పెయిర్ ధరించాడట. దీంతో దాన్ని ఒక ఆచారంగా పాటించాలని డిసైడ్ అయినట్లుగా యుకీ కాజీ వెల్లడించాడు.

ఇప్పుడు ఆ అండర్ ప్యాంట్స్ కు చిల్లులు పడ్డాయని.. చివరి రికార్డింగ్ సెషన్ తర్వాత వాటికి రిటైర్ మెంట్ ఇస్తానని యుకీ చెప్పడం ఆశ్చర్యంగా మారింది. అయితే ప్రతీ రికార్డింగ్ సెషన్ కు ఒకే అండర్ వేర్ ధరించే అతని వింత ఆచారం విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ సిరీస్ లోని పాత్రకు జీవం పోసేందుకు ఒక నమ్మకాన్ని ఏర్పర్చుకుని కష్టపడినట్లుగా భావించవచ్చని అభిమానులు అంటున్నారు. ఇక ఎటాక్ ఆన్ టైటాన్ పూర్తవనుండగా.. దాని స్థానంలో కొత్త చాప్టర్ ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











