అతనికి నాకు ఉన్న సంబంధం మాటల్లో చెప్పలేనిదంటున్న స్టార్ హీరోయిన్
ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖెల్ క్లార్క్ నుండి విడిపోయిన తర్వాత మోడల్ లారా బింగిల్ అమెరికా రాపర్ జాసన్ డ్యూర్లో ప్రేమలో పడడం జరిగింది. ఈవిషయంపై ఎన్నో సార్లు స్పందించమని అడిగినా లారా బింగిల్ తనదైన శైలిలో తప్పించుకోవడం జరిగింది. కానీ మొట్టమొదటి సారి జాసన్ డ్యూర్లో గురించి వీరిద్దరి మద్యా ఉన్నటువంటి రిలేషన్ షిప్ గురించి మీడియాకి వివరించారు లారా బింగిల్.
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో నిన్న జరిగినటువంటి డేవిడ్ జోన్స్ వింటర్ 2011 శుభారంభ కార్యక్రమంలో వీరిద్దరి మద్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి లారా బింగిల్ ధరించినటువంటి డ్రస్సు ఆద్యంతం అక్కడున్న చూపరుల చూపు వెనక్కు తిప్పుకోలేనంతగా ఉందంటే నమ్మండి. తన అందాలను బికినిలలో ప్రదర్శించే ఈ బికిని బేబి మాట్లాడుతూ నాకు జాసన్ డ్యూర్లోకు ఉన్నటువంటి సంబంధం విడదీయరాదని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇప్పటి వరకు నాకు తగిలినటువంటి మనుషుల్లో చాలా మంచి మనసు కలవాడని అన్నారు.
నాకు తెలిసి జాసన్ డ్యూర్లో చాలా మంచి మనసు కలవాడని అన్నారు. ప్రస్తుతం మేమిద్దరం కలసి కొంత జీవితాన్ని పంచుకుంటున్నామని, రాబోవు కాలంలో కూడా మేమిద్దరం ఇలాగే కలసి జీవించాలని, మా అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం నేను ఇక్కడ మీముందు ఉన్నానని, తను మాత్రం ఎక్కుడున్నాడో నాకు తెలియదని అన్నారు.


Click it and Unblock the Notifications











