'డాడ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రేసులో పాప్ సింగర్
లండన్: ఇటీవల తండ్రులుగా మారిన సింగర్ జే-జడ్ మరియు బ్రిటిష్ రియాలిటీ టీవి స్టార్ జాక్ ఓస్బోర్నే, ఇద్దరూ 'డాడ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రేసులో ఉన్నారు. జనవరిలో సింగర్ జే-జడ్ భార్య బేయోన్స్ నోలెస్ 'బ్లూ ఐవి కార్టర్' అనే పాపకు జన్మనివ్వగా.. నెల వయసు కలిగిన బేబి పెర్ల్‌కు తండ్రి అయ్యాడు. ఈ ఇద్దరూ కూడా 'ప్రీమియర్ ఇన్ సెలబ్రిటీ డాడ్ ఆఫ్ ఇయర్ ప్రైజ్'కు గాను షార్ట్ లిస్ట్ అయ్యారు.
'డాడ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు బరిలో వీరితో పాటు ప్రముఖ సింగర్స్ రాడ్ స్టివార్ట్, గ్యారీ బార్లో తదితరులు ఉన్నారు. సింగర్ ఎల్టాన్ జాన్, రాపర్ డాప్పీలు ఈ అవార్డుల బరిలో ఉన్నారు. గతయేడాది 'మిస్టీరియస్ గర్ల్' సింగర్ పీటర్ ఆండ్రేకు 'డాడ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు లభించింది.
ఇటీవలే హాలీవుడ్ పాప్ స్టార్ బియోన్స్ నోవెల్స్. ఈ ముప్పయ్యేళ్ల సౌందర్యరాశిని ఈ ఏడాది 'ప్రపంచంలోనే అత్యంత అందగత్తె'గా ప్రముఖ పీపుల్ మ్యాగజైన్ ఎంపికచేసింది. ఇటీవల జనవరిలో తన మొదటి బిడ్డ 'బ్లూ ఐవీ'కి జన్మను ఇచ్చిన తర్వాత బియోన్స్ నోవెల్స్ అందం మరింత పెరిగిందని పీపుల్ మ్యాగజైన్ ఎడిటర్స్ మ్యాగజైన్ వెబ్ సైట్‌లో తెలిపారు.


Click it and Unblock the Notifications











