twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా కోసం రాత్రి మొత్తం రెస్టారెంట్ తెరచేఉంటుంది..!

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ లో పెళ్శిచేసుకోవడం విడిపోవడం అనేవి మామూలే. కాని తన భార్య కోసం తాను ఏమి చేయడానికైన సిద్దం అంటున్నారు అమెరికా రాపర్ మరియు బిజినెస్ మ్యాన్ జే-జడ్. జే-జడ్ తనకంటే కూడా తన భార్యను ఎక్కువగా ప్రేమిస్తానని చాలా సంధర్బాలలో చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో తన భార్య కోసం అనే 'మార్లోన్ బ్రాండో రిటైర్మంట్ ప్లాన్' కూడా ప్రకటించాడు. అదేంటంటే బాగా లావుగా తయారై, తన భార్య 'బియాన్స్' తో తన ప్రయివేట్ ఐలాండ్ లో గడపాలని కోరికకలిగిందంట. ఈ ఐలాండ్ లో మాతో పాటు ఒక ఛెఫ్, సిగార్స్, వైన్స్ మాత్రమే ఉండాలని కోరుకున్నాడట. కాని తన భార్యకు మాత్రం తాను లావుగా అవ్వడం ఇష్టం లేదని, కాని నా సంతోషం కోసమే నేను అలా అవ్వాలని అనుకుంటున్నానని తన మనోభావాలను వెల్లడంచడం జరిగినది. హిప్ హప్ మ్యూజిక్ లో జే-జడ్ ప్రపంచం మొత్తాన్ని అలరించాడు. తన మ్యూజిక్ కు గాను 10 గ్రామీ అవార్డులను సోంతం చేసుకున్నాడు.

    తన భార్య 29వ పుట్టనరోజుని చాలా గ్రాండ్ గా జరపాలని నిర్ణయించుకున్నాడు. దీనికిగాను రెస్టారెంట్ యాజమాన్యంతో మాట్లాడి రాత్రి మొత్తం రెస్టారెంట్ తెరచేఉంచేటట్టు బేరం కుదుర్చుకున్నాడు. అంతేకాకుండా తన భార్య స్నేహితురాళ్సైన అలైకా కీస్, సెరీనా విలియమ్స్, కాన్యే వెస్ట్ లాంటి ప్రముఖలందరిని తన భార్యకు తెలియకుండా స్వాగతించడం జరిగింది. ఈ పార్టీకి బియాన్స్ తోపాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా ఉంటారని వెల్లడించారు. అంతేకాకుండా తన భార్య రూమ్ నిండా గిప్ట్ లతో నింపి తనకి పెద్ద ఆశ్చర్యాన్నికలగజేస్తానని వివరించారు. ఇంకోక కోసమెరుపు ఏంటంటే తన భార్య పుట్టినరోజునాడు జే-జడ్ 'డీజే' అవతారం ఎత్తనున్నాడు. సో దీనిని బట్టి మనకు ఏమి అర్దం అవుతుందంటే తన భార్యను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడని. ఈ ప్రేమ కలకాలం ఇలాగే నిలవాలని కోరుకుందాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X