డేటింగ్ రూమర్స్‌పై ట్విట్టర్‌లో సంజాయిషీ..
ఓపెరా సింగర్ కేథరిన్ జెంకిన్స్ ప్రముఖ అమెరికన్ డ్యాన్సర్ మార్క్ బెల్లాస్‌తో తాను డేటింగ్ చేస్తున్నానని వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఈ రూమర్స్ రావడానికి కారణం 31 సంవత్సరాల వయసు కలిగిన కేథరిన్ జెంకిన్స్ త్వరలో అమెరికాలో ప్రారంభం కానున్న రియాలిటీ షో 'డాన్సింగ్ విత్ ద స్టార్స్' కార్యక్రమంలో మార్క్ బెల్లాస్‌తో కలసి స్టేజిపై పాల్లోనడమే.
ఈ కార్యక్రమం కోసం వీరిద్దరూ కొంత సమయాన్ని పర్సనల్‌గా గడుపుతున్నారని సమాచారం. కేథరిన్ జెంకిన్స్ మాత్రం మా ఇద్దరి మద్య వృత్తికి సంబంధించిన రిలేషన్ తప్ప వేరే ఇతర సంబంధాలు లేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా తాను ఎంతగానో ప్రేమించి.. పెళ్లి చేసుకుందామనుకున్న టివి ప్రెజెంటర్ గేతన్ జోన్స్‌తో ఎంగేజ్‌మెంట్ విఫలం అయిన సంగతి తెలిసిందే.
దీంతో తన ట్విట్టర్‌లో జోన్స్‌తో నా ఎంగేజ్‌మెంట్ విఫలమై కనీసం రెండు నెలలు కాకముందే అప్పుడే ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారు. ఈ రూమర్స్‌లో ఎటువంటి నిజం లేదని తన ట్విట్టర్ ద్వారా అభిమానుల కోసం ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











