Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో, హీరోయిన్ ఇల్లు అమ్మకానికి పెట్టారు... షాకిస్తున్న రేటు!
హాలీవుడ్ స్టార్స్, మాజీ భార్య భర్తలు బ్రాడ్ పిట్, జెన్నిఫర్ ఆనిస్టన్ ఒకప్పుడు నివాసం ఉన్న ఇంటిని తాజాగా అమ్మకానికి పెట్టారు. 2001లో వీరు కలిసి ఉన్న సమయంలో కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో 13.5 మిలియన్ డాలర్ల(రూ. 93 కోట్లు) ఖర్చుతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇపుడు దాన్ని 49 మిలియన్ డాలర్లు(రూ. 343 కోట్లు)కు అమ్మకానికి పెట్టారు.
ఈ ఇంటిని 1934లో నిర్మించారు. 12వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ భవంతిలో టెన్నికోర్ట్, ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 4 బెడ్రూంలు, 12 బాత్రూంలు, దాదాపు 20 మంది ఒకేసారి కూర్చుని తినగలిగే విశాలమైన డైనింగ్ హాల్, బార్ రూమ్, ప్రైవేట్ ఎక్సర్సైజ్ రూమ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.
బ్రాడ్ పిట్, జెన్నిఫర్ 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్ల కాపురం తర్వాత వీరు విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రాడ్ పిట్ ఏంజెలీనా జోలీని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం బ్రాడ్ పిట్, జెన్నిఫర్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ మధ్య జెన్నిఫర్ 50వ పుట్టినరోజు వేడుకకు కూడా బ్రాడ్ పిట్ హాజరయ్యారు.
జెన్నిఫర్ 2015లో జెస్టిన్ థ్రాక్స్ను పెళ్లాడి 2018లో ఈ ఇద్దరూ విడిపోయారు. జెన్నిఫర్ 50వ పుట్టినరోజు వేడుకకు బ్రాడ్ పిట్ రావడంతో ఇద్దరూ మళ్లీ కలుస్తారని అభిమానులు భావించారు. అయితే అలాంటిదేమీ జరుగలేదు. మరో వైపు బ్రాడ్ పిట్ సైతం ఏంజెలీనా జోలీతో విడిపోయిన సంగతి తెలిసిందే.