For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో, హీరోయిన్ ఇల్లు అమ్మకానికి పెట్టారు... షాకిస్తున్న రేటు!

    |

    హాలీవుడ్ స్టార్స్, మాజీ భార్య భర్తలు బ్రాడ్ పిట్, జెన్నిఫర్ ఆనిస్టన్ ఒకప్పుడు నివాసం ఉన్న ఇంటిని తాజాగా అమ్మకానికి పెట్టారు. 2001లో వీరు కలిసి ఉన్న సమయంలో కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో 13.5 మిలియన్ డాలర్ల(రూ. 93 కోట్లు) ఖర్చుతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇపుడు దాన్ని 49 మిలియన్ డాలర్లు(రూ. 343 కోట్లు)కు అమ్మకానికి పెట్టారు.

    ఈ ఇంటిని 1934లో నిర్మించారు. 12వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ భవంతిలో టెన్నికోర్ట్, ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 4 బెడ్రూంలు, 12 బాత్రూంలు, దాదాపు 20 మంది ఒకేసారి కూర్చుని తినగలిగే విశాలమైన డైనింగ్ హాల్, బార్ రూమ్, ప్రైవేట్ ఎక్సర్‌‌సైజ్ రూమ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.

    Jennifer Aniston and Brad Pitts Beverly Hills house is now on sale

    బ్రాడ్ పిట్, జెన్నిఫర్ 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్ల కాపురం తర్వాత వీరు విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రాడ్ పిట్ ఏంజెలీనా జోలీని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం బ్రాడ్ పిట్, జెన్నిఫర్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ మధ్య జెన్నిఫర్ 50వ పుట్టినరోజు వేడుకకు కూడా బ్రాడ్ పిట్ హాజరయ్యారు.

    జెన్నిఫర్ 2015లో జెస్టిన్ థ్రాక్స్‌ను పెళ్లాడి 2018లో ఈ ఇద్దరూ విడిపోయారు. జెన్నిఫర్ 50వ పుట్టినరోజు వేడుకకు బ్రాడ్ పిట్ రావడంతో ఇద్దరూ మళ్లీ కలుస్తారని అభిమానులు భావించారు. అయితే అలాంటిదేమీ జరుగలేదు. మరో వైపు బ్రాడ్ పిట్ సైతం ఏంజెలీనా జోలీతో విడిపోయిన సంగతి తెలిసిందే.

    English summary
    Jennifer Aniston and Brad Pitt's Beverly Hills house is now on sale for 49 million dollars. The house was built in 1934. The 12,000 square foot mansion is described as a gated-tennis court estate, The mansion has four bedrooms and twelve bathrooms as well as a spacious dining room that has place for around 20 people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X