వారిద్దరి కలయిక... ఆమెకు ఒళ్లు మంట..
హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ అక్టోబరు 24న చిన్నపాటి ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను పరామర్శించాడనికి వచ్చిన ఆయన మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్ బ్రాడ్ ను తిరిగి తన జీవితం లోకి రావాలని అర్థించిందట. ఐదేళ్ల వివాహ జీవితానంతరం 2005లో బ్రాడ్ నుండీ విడిపోయిన జెన్నిఫర్, బ్రాడ్-ఏంజలీనా లు విడిపోనున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
నేషనల్ ఎంక్వయిరర్ కథనం ప్రకారం లాస్ ఏంజిల్స్ లో బ్రాడ్ ప్రమాదానికి గురయ్యాక, ఆయన్ను జెన్నిఫర్ కలసింది. 30 నిమిషాల పాటు జరిగిన వీరి సంభాషనల్లో వారి వృత్తిపర విషయాలతో పాటు కుటుంబ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయట. జెన్నితో బ్రాడ్ ఏంజలీనాతో తన సంబంధం చెడిందని, ఒక వేళ తాము విడిపోవచ్చేమోనని అన్నాడట. అంతే కాదు తనని బాధపెట్టినందుకు జెన్నిఫర్ ను క్షమాపన కూడా కోరాడట. తిరిగి తమ స్నేహాన్ని కొనసాగిద్దామని కోరాడట. దీనికి జెన్నీ సానుకూలంగా స్పందించిందని విశ్వసనీయ సమాచారం. ఏంజలీనా మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేస్తోందట.


Click it and Unblock the Notifications











