పోల్ డాన్సింగ్‌లో ఆమె కేక..
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫర్ ఆనిస్టన్ పోల్ డాన్సింగులో కేక అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు ఆమె కోస్టార్ ఎమ్మా రాబర్ట్స్. గతంలో వీరిద్దరు కలిసి 'విఆర్ ద మిల్లర్స్' అనే చిత్రంలో నటించారు. 'ఆమె చేసిన పోల్ డాన్సింగ్ బిట్స్ చూసాను. నిజంగా ఆమె అద్భుతంగా చేసింది. 43 ఏళ్ల వయసులోనూ ఆమె ఎంతో హాట్ గా కనిపిస్తోంది' అంటూ వ్యాఖ్యానించారు.
జెన్నిఫర్ ఆనిస్టన్ ఎవరో కాదు... ప్రముఖ హాలీవుడ్ హీరో బ్రాడ్ ఫిట్ మాజీ భార్య. గతంలో జెన్నిఫర్ ఆనిస్టన్, ఏంజలీనా జోలీ స్నేహితులు. జెన్నిఫర్ ఆనిస్టన్ తో స్నేహ చేస్తూ మెల్లిగా ఆమె భర్తతో సంబంధం పెట్టుకుంది. ఏంజలీనా జోలీపై మోజుతో భార్య జెన్నిఫర్‌కు విడాకులు ఇచ్చాడు బ్రాడ్ ఫిట్.
భర్త బ్రాడ్ ఫిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ కొన్నాళ్లు ఒంటరిగా జీవించినా గత కొంత కాలంగా నటుడు మరియు డైరెక్టర్ జస్టిన్ థ్రాక్స్ తో డేటింగ్ చేస్తుంది. 43 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ ప్రపోజ్ చేయడం.. ఆ వెంటనే అక్కడే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది.
త్వరలో జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లికి మాజీ అత్త, బ్రాడ్ ఫిట్ తల్లి జేన్ పిట్‌ను కూడా ఇన్వైట్ చేయనుంది జెన్నిఫర్ ఆనిస్టన్. బ్రాడ్ ఫిట్ నుంచి విడిపోయినప్పటికీ జేన్ పిట్ అంటే ఆమెకు ఎంతో అభిమానం. సొంత తల్లీ కూతుర్ల బంధం మాదిరి వీరి మధ్య రిలేషన్ ఉంది. జెన్నిఫర్ ఆనిస్టన్, బ్రాడ్ పిట్ ఇద్దరూ 2000 నుండి 2005 వరకు కలిసి జీవించి ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











