డ్రగ్స్ తీసుకుంటున్న జెన్నిఫర్ ఆనిస్టన్...!
జెన్నిఫర్ ఆనిస్టన్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి 'బ్రాడ్ పిట్'. ఈమె బ్రాడ్ పిట్ భార్యగా అందరకి సుపరిచితురాలు. ఈ ముద్దుగుమ్మ శృంగారంలో పాల్గోనకుండా కూడా పిల్లలను కనవచ్చు అని నటించిన 'ది స్విచ్' అనే సినిమా లో శృంగారం పండించింది.
హాలీవుడ్ లో ఏంజలీనా జోలీ, జెన్నిఫర్ అనిస్టాన్ లు ఏం చేసినా కొత్తగా వుంటుంది. దీనికి కారణం వీరిద్దరి మద్య ఉన్న విరోధం. జెన్నిఫర్ అనిస్టాన్ తో హాయిగా కాపురం చేసుకుంటున్న బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీని కలిసాక ఆమె వైపు ఆకర్షితుడై అనిస్టాన్ ను వదిలేసి ఏంజలీనాను పెళ్లిచేసుకున్న దగ్గర్నుంచీ వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుండి వీరిద్దరి మధ్య అన్నింటి లో పోటి ఏర్పడింది.
ఇటీవల ఏంజలీనా జోలీ 'సాల్ట్' అనే సినిమాతో బాక్సా ఫీస్ రికార్డులను బద్దలు కోట్టగా, నేనేమి తక్కువ తిన్నాన అంటూ జెన్నిఫర్ అనిస్టాన్ 'ది స్విచ్' అనే సినిమాతో బాక్సా ఫీస్ రికార్డులను బద్దలు కోట్టింది. తర్వాత ఈ అమ్మడు కోత్తగా ఇంకోక సినిమా లో డ్రగ్స్ తీసుకునే క్యారెక్టర్ లో నటించడానికి ఒప్పుకుంది.
ఈ సినిమా దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో మీరు కొత్త జెన్నిఫర్ అనిస్టాన్ చూస్తారు. అనిస్టాన్ చేసే ఈ క్యారెక్టర్ నిజజీవితంలో 'డ్రగ్స్' తీసుకునే వాళ్శు ఎలాగైతే ప్రవర్తిస్తారో, అనిస్టాన్ కూడా అలానే చేస్తుందని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా పాల్ రెడ్ నటిస్తున్నారు. ఈ సినిమా పేరు 'వ్యాండర్ లాస్ట్'.
మన టాలీవుడ్ లో కూడా ఇటీవల కాలంలో కొంతమంది హిరోలు డ్రగ్స్ తీసుకుంటూ దోరికిపోయారు. ఇది మనిషి జీవితాన్నే నాశనం చేస్తుందని చాలా మంది చెబుతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత అన్న ఇలాంటి వారికి దూరంగా వుండాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











