నగ్నంగా ఫోజులు.. నేను సిగ్గుపడటం లేదంటూ హీరోయిన్ స్టేట్మెంట్!
హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ టాప్ లెస్ ఫోజులతో ఇంటర్నెట్లో ప్రకంపణలు సృష్టిస్తోంది. హార్పర్స్ బజార్ జూన్ సంచిక కోసం నగ్నంగా ఫోజులు ఇవ్వడం ద్వారా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదు. అయితే తన చర్యను సమర్దించుకుంటూ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
ఇటీవల తన స్నేహితురాలు ఎలెన్ డిజెనెరస్ టాక్ షోలో పాల్గొన్న జెన్నిఫర్ ఆనిస్టన్... తనకు నగ్నత్వం అంటే ఇష్టమని, అలా ఉండటాన్ని చాలా ఇష్టపడతాను అని తెలిపారు. ఈ క్రమంలో ఆమె నగ్నత్వం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

నేను సిగ్గు పడటం లేదు, మీరూ పడొద్దు
నువ్వు నీ గురించి, నీ శరీరం గురించి చాలా కేర్ తీసుకుంటావు. ఇలా నగ్నంగా ఉండటాన్ని చాలా ఎంజాయ్ చేస్తావు. కానీ ఇలా నీ స్తనాలను చేతులతో అదిమి పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడంపై నీకు సిగ్గు అనిపించడం లేదా? అంటూ ఎలెన్ డిజెనెరస్ జెన్నిఫర్ ఆనిస్టన్‌కు ఓ ప్రశ్న సంధించారు. దీనికి ఏ మాత్రం తడబాటు లేకుండా ‘నేను ఏ మాత్రం సిగ్గు పడటం లేదు... ఇతరులెవరూ కూడా అలా నన్ను చూసి సిగ్గుపడాల్సిన అవసరం లేదు' అంటూ రిప్లై ఇచ్చింది.

నగ్నత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి
గత ఇంటర్వ్యూలో కూడా జెన్నిఫర్ నగ్నత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరికి అలా ఉండటం అంటే ఇష్టం. అలాంటి వారిలో నేనూ ఒకరు. మన శరీరాన్ని చూసి మనం మురిసిపోవాలి, సెలబ్రేట్ చేసుకునేలా ఉండాలి. దానికి వయసుతో సంబంధం లేదని జెన్నిపర్ చెప్పుకొచ్చారు.

మన శరీరాలు చాలా అందమైనవి
మన శరీరాలు చాలా అందమైనవని నేను భావిస్తాను. మనకు మనముగా దాన్ని ఆస్వాదించాలి. అప్పుడే మన శరీరంపై శ్రద్ధ పెరుగుతుందని జెన్నిఫర్ ఆనిస్టన్ చెప్పుకొచ్చారు. అందమైన శరీరాన్ని హద్దులో ఉంటూ ప్రదర్శించడంలో ఎలాంటి తప్పు లేదనే విధంగా ఆనిస్టన్ స్టేట్మెంట్ ఇచ్చారు.

జెన్నిఫర్ ఆనిస్టన్
50 ఏళ్ల జెన్నిఫర్ ఆనిస్టన్ గతంలో బ్రాడ్ పిట్, జస్టిన్ థ్రాక్స్‌ను పెళ్లాడి విడిపోయిన సంగతి తెలిసిందే. అమెరికన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో, హాలీవుడ్లో నటిగా తనదైన ముద్ర వేసిన జెన్నిఫర్ నగ్నత్వం గురించిన స్టేట్మెంట్లతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications











