ఆయనతో పిల్లల్ని కనలేదు.. సంతానం కోసం పెళ్లి అవసరమా?
హాలీవుడ్‌లో నటుడు బ్రాడ్ పిట్ ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ వార్తల్లో ప్రదానంగా కనిపిస్తాయి. భార్య ఎంజెలీనా జోలితో విడిపోయిన తర్వాత మాజీ ప్రియురాలు జెన్నిఫర్ అనిస్టన్‌కు చేరువైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి అఫైర్ హాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో జెన్నిఫర్ అనిస్టన్ గర్బవతి అనే వార్తలు ఊపందుకోవడంతో ఆమె మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. గతంలో ఐదేళ్ల దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. వివరాల్లోకి వెళితే..

ఐదేళ్లుగా మా మధ్య రిలేషన్
బ్రాడ్‌పిట్‌తో రిలేషన్ గురించి జెన్నిఫర్ ప్రస్తావిస్తూ.. గత ఐదేళ్లుగా మా మధ్య రిలేషన్ కొనసాగుతున్నది. అయితే సంతానంపై కాకుండా నా కెరీర్‌పైనే దృష్టిపెట్టాను. మేము పిల్లల కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. డైవోర్స్ తర్వాత నేను కెరీర్‌పైనే దృష్టిపెట్టాను అని అన్నారు.

ఆయనతో పిల్లల్ని కనలేదు
నా జీవితంలో నేను ఎప్పుడూ సంతానాన్ని కోరుకోలేదు. గతంలో పిల్లల్ని కనే విషయం ఆలోచించలేదు. కానీ భవిష్యత్‌లో ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు. కెరీర్‌ను చక్క దిద్దుకొంటాను. పిల్లల్ని కంటాను. ఈ విషయంలో ఎందరో మహిళలు నాకు స్ఫూర్తి. నా జీవితంపై నేను ఎందుకు పరిమితులు పెట్టుకోవాలి అని జెన్నిఫర్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

పెళ్లి చేసుకోకుండా కూడా
పిల్లల కోసం చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకోవడం వల్లనే కాకుండా పెళ్లి చేసుకోకుండా కూడా పిల్లల్ని కనవచ్చును. తల్లిగా మారడానికి ఎంతో మహిళలు నాకు స్ఫూర్తి. పెళ్లి గురించి ఆలోచించకుండా మేము ఎంత ఆనందంగా ఉన్నామో అనేది మాకు ముఖ్యం అని జెన్నిఫర్ పేర్కొన్నారు.

జెన్నిఫర్‌తో జీవితం సాఫీగా
జెన్నిఫర్‌తో జీవితం సాఫీగా సాగుతున్నది. ఆమెతో పిల్లల్ని కనడం ప్రయారిటీ కాదు. జీవితంలో అది ఓ భాగం మాత్రమే. నా ఫ్యామిలీ గురించి చెప్పుకోవడానికి నేను ఎవరికీ సమాధానం చెప్పుకోవనసరం లేదు. నేను సరైన భర్తనా? కాదా అనే మా ఇద్దరి మధ్య అవగాహన మేరకు ఆధారపడి ఉంటుంది అని బ్రాడ్ పిట్ ఇటీవల పేర్కొన్నారు.

బ్రాడ్‌పిట్‌కు ఆరుగురు సంతానం
బ్రాడ్ పిట్ విషయాని వస్తే.. ఎంజెలీనా జోలితో ఆరుగురు సంతానం కలిగి ఉన్నాడు. అందులో ముగ్గురు దత్తత తీసుకొన్న వారు ఉండటం గమనార్హం. అయితే పిల్లల విషయంలో దురుసుగా ప్రవర్తించారనే కారణంతో ఎంజెలీనా విడిపోయింది. వారి విడాకులు తర్వాత జెన్నిఫర్‌తో అఫైర్ పెట్టుకోవడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











