భర్తతో విడిపోయినా... అత్తపై హీరోయిన్ ప్రేమ!
లాస్ ఏంజిల్స్: భర్త బ్రాడ్ ఫిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ కొన్నాళ్లు ఒంటరిగా జీవించినా గత కొంత కాలంగా నటుడు మరియు డైరెక్టర్ జస్టిన్ థ్రాక్స్ తో డేటింగ్ చేస్తుంది. ఆగస్టు 10న జస్టిన్ థ్రాక్స్ 41వ పుట్టినరోజు సందర్బంగా 43 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ ప్రపోజ్ చేయడం.. ఆ వెంటనే అక్కడే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది.
త్వరలో జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లికి మాజీ అత్త, బ్రాడ్ ఫిట్ తల్లి జేన్ పిట్‌ను కూడా ఇన్వైట్ చేయనుంది జెన్నిఫర్ ఆనిస్టన్. బ్రాడ్ ఫిట్ నుంచి విడిపోయినప్పటికీ జేన్ పిట్ అంటే ఆమెకు ఎంతో అభిమానం. సొంత తల్లీ కూతుర్ల బంధం మాదిరి వీరి మధ్య రిలేషన్ ఉంది. జెన్నిఫర్ ఆనిస్టన్, బ్రాడ్ పిట్ ఇద్దరూ 2000 నుండి 2005 వరకు కలిసి జీవించి ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
గత ఏప్రిల్‌లో బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ జంటకు నిశ్చతార్దం అయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి వివాహాం సెప్టెంబర్ లో జరగనుంది. దీంతో వీరి వివాహానికి జెన్నిఫర్ ఆనిస్టన్ ఆల్ ద బెస్ట్ చెప్పింది. బ్రాడ్ పిట్ తనకి కాబోయే భార్య ఏంజిలీనా జోలీ కోసం పెళ్లి కానుకగా $390,000 విలువ కలిగిన ఖరీదైన లగ్జరియస్ పాటెక్ ఫిలిప్పీ మినిట్ రిపీటర్ వాచ్‌ని గిప్ట్‌గా ఇవ్వనున్నాడు.


Click it and Unblock the Notifications











