అంతా ఒట్టిదే.. నేనందులో చేయడం లేదు
హాలీవుడ్ తార జెన్నిఫర్ అనిస్టాన్, టామ్ క్రూజ్ ను వివాహం చేసుకున్నాక సినిమాలకు దూరమయింది. తమ రెండేళ్ల పాప సూరిని చూసుకుంటూ మురిసిపోతోంది. సూరితో గడపటానికే సమయం సరిపోవడం లేదని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన అనిస్టాన్, సూరిని స్కూల్ లో చేర్చాక ఖాళీగా వుండటం ఎందుకు అని ఓ టెలివిజన్ నిర్వహించబోయే టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనుందనే వార్త నిన్నమొన్నటి వరకూ హాలీవుడ్ వీధుల్లో షికారు చేసాయి.
ఓప్రా విన్ ఫ్రే కేబుస్ ఛానెల్ నిర్వహించబోయే ఈ షోలో ఈమె ప్రధాన ఆర్షణగా నిలవనుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని అంతా ఒట్టిదే అని అనిష్టాన్ తేల్చిపారేసింది. ఓప్రా విన్ ఫ్రే కేబుస్ ఛానెల్ వారు కూడా ఇది ఓ గాలి వార్తే అని వివరణ ఇచ్చారు.
జెన్నిఫర్ అనిస్టాన్ టామ్ క్రూజ్ హాలీవుడ్ ఓప్రా విన్ ఫ్రే jennifer aniston hollywood tom cruise oprah winfrey


Click it and Unblock the Notifications