తన సవతి నుండీ అది దోచేసిన అనిస్టాన్...!!
గత దశాబ్దపు అందమయిన మహిళగా పేరొందిన ఏంజలీనా జోలీ తన సవతి, బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్ ను వెనక్కునెట్టి మరీ ఈ ఘనతను సాధించింది. దీంతో అనిస్టాన్ రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏంజలీనా అందం కన్నా ఆమె వ్యక్తిత్వం చాలా మందిని ఆకర్షించింది అనడంలో సందేహం లేదు. చాలా అగ్రెసివ్ గా కనిపించే ఆమె డ్రస్సింగ్ లో కూడా ఆ దర్పం తొనికిసలాడుతుంది. చూడగానే ఆ నడకతో అందరి దృష్టినీ ఆతర్షిస్తుంది జోలీ.
గత ఆదివారం నాడు జరిగిన గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి జోలీ, బ్రాడ్ ల జంట హాజరుకాకపోవడం చాలా వెలితిగా అనిపించింది. అయితేనేం అనిస్టాన్ జోలీని అనుకరిస్తున్నట్టు చాలా బోల్డ్ గా డ్రస్సప్ అయి ఆమెలాగా చాలా దర్పంగా నడచిరావడంతో అందరూ జోలీని చూసినట్టే అనుభూతి చెందారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడున్న చిత్రాన్ని గమనిస్తే గత సంవత్సరం గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి జోలీ హాజరయిన చిత్రాన్ని, ఇప్పటి అనిస్టాన్ చిత్రాన్ని పరికించి చూస్తే ఆ పోలిక మీకు కూడా కనిపిస్తుంది. మరి సినిమాల్లో కూడా అనిస్టాన్ జోలీని అనుకరిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం జోలీ సాల్ట్, ది టూరిస్ట్ చిత్రాల్లో నటిస్తుండగా అనిస్టాన్ ది బౌంటీ హంటర్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











