ట్యాక్సీ లో నగ్నంగా కూర్చున్న జెన్నిఫర్..!
మనకు ట్యాక్సీ కావాలనుకున్నప్పుడు ట్యాక్సీ కోసం వేచిచూస్తాం. ట్యాక్సీవచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్లాలో చెప్తాం, దానితో ఆ చోటికి ట్యాక్సీ అతను రాకపోతే ఇంకోక ట్యాక్సీని చూసుకుంటాం. కానీ అమెరికాలోని లూసియానాలో 29సంవత్సరాల అమ్మడు ఏంచేసిందో తెలుసుకుంటే మనకు కడుపుబ్బా నవ్వువస్తుంది, అంతేకాకుండా ట్యాక్సీ డ్రైవర్లు అందరూ మన దేశంలో ఐతే ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటారు. ఇంతకి ఏమి జరిగిందంటే తన రమ్మన్నచోటికి రాలేదని ట్యాక్సీ నుంచి దిగకుండా అందులోనే కూర్చుండిపోయింది. అయినా ట్యాక్సీ డ్రైవర్ లొం గకపోయే సరికి, జెన్నిఫర్ తన ఒంటిపైనున్న దుస్తులన్నీ విప్పేసి ట్యాక్సీ లో నగ్నంగా కూర్చుంది. ఇది చూసి బెంబేలెత్తిన ట్యాక్సీ డ్రైవర్ కారు దిగి, పోలీసులను ఆశ్రయించేందుకు వెళ్లేసరికి, ఈ చిన్నది ఏకంగా ఆ కారునే తీసుకుని జంప్ జిలాని అంది.
లూసియానా పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోవింగ్టన్‌లోని ఓ ప్రదేశానికి వెళ్లేందుకు ఓ ట్యాక్సీని జెన్నిఫర్ మాట్లాడుకుంది. అనంతరం గమ్యస్థానానికి ట్యాక్సీ చేరుకున్నాక జెన్నిఫర్ కారులోంచి దిగనంది. తనను సరాసరి తన సొంత రాష్ట్రం మిచిగాన్‌కు తీసుకెళ్లాలని ట్యాక్సీ డ్రైవర్ ను కోరింది. అందుకు ట్యాక్సీ డ్రైవర్ సమ్మతించకపోయే సరికి కార్లోనే దుస్తులు ఊడదీసుకొని నగ్నంగా కూర్చుంది. ఇది చూసి..బెంబేలెత్తిన ఆ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఈ లోగా ఆ చిన్నది ఏకంగా ట్యాక్సీనే తీసుకొని జారుకుంది. ఈమెను వెంబడించి పట్టుకున్న పోలీసులు ఏ ఆచ్చాదనా లేకుండా జెన్నిఫర్ కారు నడుపుతున్న వైనం చూసి విస్తుపోయారు. ఇతరుల వాహనాన్ని అనుమతి లేకుండా ఉపయోగించడం మరియు ఆశ్లీలంగా ప్రవర్తించడం అనే రెండు నేరాలపై పోలీసులు జెన్నిఫర్ పై కేసులు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











