న్యూడ్ ఫోటోలు లీక్: సెక్స్ క్రైమ్ అంటున్న హీరోయిన్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ లారెన్స్ పర్సనల్ న్యూడ్ ఫోటోలు అప్పట్లో లీక్ అయి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జెన్నిఫర్ లారెన్స్ తో పాటు రిహానా, ఇంకా పలువురు సెలబ్రిటీల న్యూడ్ ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి. హాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ అకౌంట్లపై హ్యాకర్లు మూకుమ్మడి దాడి చేసి వారికి సంబంధించిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేసారు.
ఈ భారీ హ్యాకింగు వల్ల అందరి కంటే ఎక్కువగా నష్ట పోయింది జెన్నిఫర్ లారెన్సే కావడం గమనార్హం. ఆమెకు సంబంధించిన షాకింగ్ న్యూడ్ ఫోటోలు, ఆమె గురించి ఎవరూ ఊహించని నగ్న ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి. ఈ ఘటనతో జెన్నిఫర్ లారెన్స్ తీవ్ర ఆగ్రహానికి గురైంది.

ఈ సంఘటనపై జెన్నిఫర్ లారెన్స్ ఎట్టకేలకు స్పందించింది. న్యూడ్ ఫోటోలను పర్సనల్ అకౌంట్ల నుండి దొంగిలించడం సెక్స్ క్రైమే అంటోంది ఈ భామ. ఇంతటితో ఆగకుండా ఈ ఫోటోలు చూసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని కూడా తప్పుబడుతోంది. లీక్ చేసిన వారితో పాటు వీటిని షేర్ చేసిన వారు కూడా సెక్స్ క్రైమ్‌కు పాల్పడినట్లే అని మండి పడింది.
ప్రస్తుతం ఈ న్యూడ్ ఫోటోల లీక్ ఘటనపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ గురించి తానేమీ ఎదురు చూడటం లేదని, ఈ ఘటనపై తానే బాధ పడటం లేదని చెప్పిన జెన్నిఫర్ లారెన్స్..... చుట్టూ ఇలాంటి వారు ఉన్న ప్రపంచంలో ఉన్నందుకు బాధ పడుతున్నట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications











