జెన్నిఫర్ లోపేజ్‌కు మరో బ్రేకప్.. పెళ్లికి ముందు ప్రియుడికి గుడ్‌బై
హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లోపెజ్, అలెక్స్ రొడ్రిగ్స్ మధ్య కొద్ది నెలలుగా సాగుతున్న అఫైర్‌కు తెరపడింది. తమ డేటింగ్ వ్యవహారాన్ని పెళ్లిగా మలిచి తమ బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నాలకు మధ్యలోనే బ్రేక్ పడింది. వారిద్దరూ నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ముందే విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం హాలీవుడ్ మీడియాలో సంచలనం రేపింది.
మా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొంటున్నాం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఇద్దరం నిర్ణయం తీసుకొన్నాం అని జెన్నిఫర్, అలెక్స్ రొడ్రిగ్స్ సంయుక్తంగా ప్రకటనను జారీ చేశారు.

మేమిద్దరం మంచి స్నేహితులనే విషయాన్ని గ్రహించాం. ఇక ముందు కూడా అలాగే మా బంధాన్ని కొనసాగించాలని కోరుకొంటున్నాం. మేమిద్దరం ఇక ముందు కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నాం. ఒకరికొకరం సపోర్టు చేసుకోవాలనుకొంటున్నాం. మా పిల్లల సంరక్షణ బాధ్యతను మా భుజాల మీద వేసుకొంటున్నాం అని వారిద్దరు ప్రకటనలో తెలిపారు.
ఐషా శర్మ.. క్లివేజ్ షో రచ్చ మాములుగా లేదు
జెన్నీఫర్, అలెక్స్ 2017 నుంచి డేటింగ్ చేస్తూ వస్తున్నారు. రెండేళ్ల డేటింగ్ తర్వాత 2019 మార్చిలో ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నారు. అయితే గత కొద్ది నెలలుగా వారిద్దరూ విడిపోతున్నారనే వార్తలు హాలీవుడ్ మీడియాలో గుప్పుమన్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











