మాజీ ప్రియుడితో జెన్నీఫర్ లోపేజ్ రొమాన్స్.. తాజా లవర్ రియాక్షన్ ఏమిటంటే!
హాలీవుడ్‌లో అందాల సుందరి జెన్నిఫర్ లోపేజ్ డేటింగ్ వ్యవహారం రచ్చగా మారింది. తాజా మాజీ ప్రియుడు అలెక్స్ రొడ్రిగ్స్‌తో తెగతెంపులు చేసుకొన్న విషయం తెలిసిందే. అలెక్స్‌కు గుడ్ బై చెప్పి గతంలో నిశ్చితార్థం చేసుకొన్న బెన్ అఫ్లెక్‌తో శృంగార యాత్ర చేస్తున్నారు. లాస్ ఎంజెలెస్, మొంటానాలోని బిగ్ స్కై రిసార్టులో వారిద్దరి కలిసి రొమాన్స్ చేసుకోవడం మీడియా కంటపడింది.
జెన్నిఫర్ లోపేజ్, బెన్ ప్రేమ విషయాన్ని అలెక్స్‌తో మీడియా ప్రస్తావించగా.. ఆయన షాక్‌కు గురయ్యాడు. జెన్నిఫర్ ఏది నచ్చితే అదీ చేయడంపై తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వారిద్దరి మళ్లీ కలిస్తే సంతోషం. వారిద్దరు మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అంటూ కామెంట్ చేశారు.

అయితే జెన్నిఫర్ లోపేజ్ తనను విడిచి వెళ్లడంతో కొంత విషాదానికి గురవుతున్నారు. జెన్నిఫర్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు అని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక జెన్నిఫర్, బెన్ అఫ్లెక్ విషయానికి వస్తే.. 2002 నుంచి 2004 వరకు వారిద్దరి మధ్య అఫైర్ కొనసాగింది. ఆ సమయంలో వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ నిశ్చితార్థం చేసుకొన్నారు. కానీ ఊహించిన విధంగా వారిద్దరు విడిపోయారు. అనంతరం అలెక్స్ రొడ్రిగ్స్‌తో చాలా సంవత్సరాలు సహజీవనం చేసింది. తాజాగా ఆయనతో రిలేషన్‌కు గుడ్ బై చెప్పింది.


Click it and Unblock the Notifications











