బాయ్ ఫ్రెండుతో జెన్నిఫర్ లోపెజ్, ముద్దాడుతూ ఇలా (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: జెన్నిఫర్ లోపెజ్, కాస్పెర్ స్మార్ట్ గత కొంత కాలంగా చాటు మాటు ప్రేమాయణం సాగిస్తున్నారు. తాము డేటింగ్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా ఖండిస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు తమ మధ్య ‘సం'బంధం నడుస్తోందని సూచనలు ఇస్తూ ముద్దు పెట్టుకున్నారు ఈ జంట. ‘అమెరికన్ ఐడల్' షూటింగ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

45 ఏళ్ల జెన్నిర్ లోపెజ్ 27 ఏళ్ల కొరియోగ్రాఫర్ కాస్పెర్ స్మార్ట్‌తో గత కొంతకాలంగా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ వస్తోంది. భర్త మార్క్ ఆంటోనీతో విడిపోయిన తర్వాత జెన్నిఫర్ 2013 నుండి అతనికి దగ్గరవుతూ వచ్చింది. గతేడాది జరిగిన జెన్నిఫర్ లోపెజ్ వరల్డ్ టూర్‌కి అతడు చీఫ్ కొరియోగ్రాఫర్‌గా కూడా వ్యవహరించాడు. కలిసి పని చేయడం వల్ల ఇద్దరూ దగ్గరయ్యారు. తన ఇద్దరు కవల పిల్లలకు కూడా స్మార్ట్ చాలా క్లోజ్ అయ్యారని ఆ మధ్య జెన్నిఫర్ చెప్పకొచ్చింది.
జెన్నిఫర్ లోపెజ్ గురించిన ఇతర విషయాల్లోకి వస్తే... ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు సైతం తీసుకున్న జెన్నిఫర్ గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటోంది. ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ తో ప్రేమాయణం ఆమెకు ఒంటరి తనాన్నిదూరం చేసింది. ఆ మధ్య వీరు పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే వీరి మధ్య ఎపైర్ డేటింగ్ స్టేజీలోనే ఉందని స్పష్టమవుతోంది.

సంపాదన అదుర్స్...
హాలీవుడ్ నటి, అమెరికన్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ గురించి, ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు(2500 కోట్లు). అయినప్పటికీ డబ్బు సంపాదించడానికి వచ్చి ఏ ఆఫర్ కూడా ఆమె వదులుకోవడం లేదు.

ఆమె ఆ మధ్య మకావ్‌లో ఓ ప్రైవేట్ పార్టీలో 40 నిమిషాల పాటు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ఇందుకు గాను ఆమె రూ. 1.75 మిలియన్ డాలర్లు (రూ. 11 కోట్లపైనే) చార్జ్ చేసారు. 45 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్ ఇప్పటికీ తన సెక్సీ అందాలు, అదరగొట్ట పెర్పార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











