మరో స్టార్ హీరో, హీరోయిన్ విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు

ప్రముఖ హాలీవుడ్ సినీ తారలు జెన్నీఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ బ్రేకప్ వార్తలు మీడియాలో హైలెట్‌గా మారాయి. వీరిద్దరి విడాకుల వార్తపై రకరకాల ఊహాగానాలు, రూమర్లు, గాసిప్స్‌ వినిపించాయి. గత కొద్ది నెలలుగా వసున్న ఈ కథనాలకు ముగింపు పలికే విధంగా నటి జెన్నీఫర్ లోపేజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టాప్ సెలబ్రిటీ విడాకుల వార్త వివరాల్లోకి వెళితే..

జెన్నీఫర్, బెన్ అఫ్లెక్ రొమాంటిక్ లైఫ్ చాలా సుదీర్ఘమైనది. 2003 సంవత్సరంలో గిగ్లీ సినిమా షూటింగులో కలుసుకొన్న వారిద్దరి దగ్గరయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత 2004 అభిప్రాయ బేధాలు కారణంగా వారిద్దరూ విడిపోయారు. అనంతరం మళ్లీ 2022 సంవత్సరంలో కలుసుకొన్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన విలాసవంతమైన కార్యక్రమంలో ఒక్కటయ్యారు.

Jennifer Lopez files divorce petition in Los Angeles County Superior Court

హాలీవుడ్‌లో పాపులర్ సెలబ్రిటీ జెన్నీఫర్ లోపేజ్ దాంపత్య జీవితానికి వస్తే.. జెన్నీఫర్ లోపేజ్, బెన్ అఫ్లేక్ గతంలో తమ రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పారు. బెన్‌ అఫ్లెక్‌తో విడాకులు ఆమెకు అధికారికంగా 5వ సారి బ్రేకప్. గతంలో ఓజానీ, మార్క్ ఆంథోని, క్రిస్ జూడ్‌తో బ్రేకప్ జరుగగా.. బెన్ అఫ్లెక్‌తో రెండుసార్లు బ్రేకప్ జరిగింది. బెన్ అఫ్లెక్ విషయానికి వస్తే.. ఇది మూడోసారి బ్రేకప్. గతంలో జెన్నిఫర్ గార్నర్, ప్రస్తుతం జెన్నిఫర్‌తో విడాకులు జరిగాయి. అయితే జెన్నీఫర్ జీవితంలో ఈ సారి కూడా విడాకులు అనివార్యంగా మారాయి.

ఇదిలా ఉండగా, బెన్ అఫ్లెక్‌తో విడాకుల కోసం జెన్నిఫర్ కోర్టును ఆశ్రయించారు ఆమె మంగళవారం లాస్ ఎంజెలెస్‌లోని కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రెండో వార్షికోత్సవం సమయంలోనే ఈ విడాకుల పిటిషన్ దాఖలు చేయడం యాదృశ్చికంగా మారింది. దీంతో రెండేళ్ల వారి దాంపత్య జీవితానికి తెరపడనున్నది.

Jennifer Lopez files divorce petition in Los Angeles County Superior Court

ఇక జెన్నీఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. ఆమె ఆస్తి విలువ 400 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3340 కోట్ల రూపాయలు, ఇక బెన్ అఫ్లెక్ ఆస్తుల విలువ విషయానికి వస్తే..150 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 1250 కోట్ల రూపాయాలు. అయితే విడాకులు తీసుకోవడానికి ఆయన ఆస్తిలో సగం అంటే..900 కోట్లకుపైగా భరణం కోరుతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X