జెన్నిఫర్ లోపేజ్‌కు కొత్త ప్రియుడి అరుదైన గిఫ్టు.. 10 క్యారెట్ల డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్ విలువ ఎంతంటే!

హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ మరోసారి అంతర్జాతీయ మీడియాలో తళుక్కున మెరిసింది. తన తాజా మాజీ ప్రియుడు అలెక్స్ రోడ్రిగ్స్‌తో తెగతెంపులు తీసుకొని వెంటనే గతంలో సహజజీవనం చేసిన ప్రియుడు బెన్ అఫ్లెక్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నది. అయితే జెన్నిఫర్‌కు బెన్ అఫ్లెక్ ఇచ్చిన నిశ్చితార్థం ఉంగరం టాక్ ఆఫ్ ది మీడియాగా మారింది. ఆ ఉంగరం విలువ ఎంతనే విషయంలోకి వెళితే..

అలెక్స్ రొడ్రిగ్స్‌తో బ్రేకప్

అలెక్స్ రొడ్రిగ్స్‌తో బ్రేకప్

అలెక్స్ రొడ్రిగ్స్‌తో నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న జెన్నిఫర్ అనూహ్యంగా తన బంధాన్ని తుంచేసుకొన్నది. వారి మధ్య విభేధాలు తలెత్తాయని గత కొద్దికాలంగా మీడియాలో వస్తున్న వార్తల మధ్య వారిద్దరూ విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత బెన్ అఫ్లెక్‌తో వ్యక్తిగత విహారయాత్రను చేస్తూ మీడియా కంటికి చిక్కారు.

బెన్ అఫ్లెక్‌తో శృంగార యాత్ర

బెన్ అఫ్లెక్‌తో శృంగార యాత్ర

ప్రస్తుతం లాస్ ఎంజెలెస్‌కు దూరంగా ఉన్న ఓ రిసార్టులో బెన్ అఫ్లెక్‌తో విహార యాత్ర చేస్తున్న జెన్నిఫర్ లోపేజ్ చేతికి ఉన్న ఎంగేజ్‌మెంట్ ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పింక్ కలర్‌లో ఉన్న ఉంగరాన్ని బెన్ అఫ్లెక్ అప్పట్లో ప్రపోజ్ చేస్తూ జెన్నిఫర్ చేతికి తొడిగిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

జెన్నిఫర్ చేతికి 10 క్యారెట్స్ డైమండ్ ఉంగరం

జెన్నిఫర్ చేతికి 10 క్యారెట్స్ డైమండ్ ఉంగరం

జెన్నిఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ మధ్య ప్రేమ బంధం బలపడిన విషయం ఆసక్తికరమే. గిగ్లి అనే చిత్ర షూటింగులో వారిద్దరూ ఒకరి మనసును, మరొకరికి ఇచ్చుకొన్నారు. 2000 నుంచి 2003 వరకు వారు పీకల్లోతూ ప్రేమలో మునిగిన నేపథ్యంలో నిశ్చితార్థ చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. దాదాపు 10 క్యారెట్ల బరువు ఉన్న డైమండ్ రింగ్‌ను చేతికి తొడిగారు. ఆ తర్వాత ఏడాది గడవకముందే జనవరి 2004లో విడిపోయారు.

 ఎంగేజ్‌మెంట్ రింగ్ ధర..

ఎంగేజ్‌మెంట్ రింగ్ ధర..

తన ప్రేయసి జెన్నిఫర్ కోసం హ్యారీ విన్స్‌టన్ అనే జ్యువెల్లరీ వ్యాపారవేత్త నుంచి కొనుగోలు చేశారు. అప్పట్లో దాని ఖరీదు రూ.1.2 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం దాని విలువ... 8.79 కోట్ల రూపాయలు అని లెక్క కడుతున్నారు.

మూడు పెళ్లిళ్లు..మూడు సహజీవనాలతో..

మూడు పెళ్లిళ్లు..మూడు సహజీవనాలతో..

ఇక జెన్నిఫర్ లోపేజ్ పెళ్లిళ్లు, బ్రేకప్‌ల విషయానికి వస్తే.. 1997లో ఓజానీ నోవాను వివాహం చేసుకొని 1998లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత క్రిస్ జుడ్‌ను 2001 పెళ్లి చేసుకొని 2003లో విడిపోయారు. మళ్లీ 2004లో మార్క్ ఆంథోనిని వివాహం చేసుకొని 2014లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత 2002 నుంచి 2004 వరకు బెన్ అఫ్లెక్‌తో, 2011 నుంచి 2016లో కాస్పర్ స్మార్ట్‌తో, 2017 నుంచి 2021 వరకు అలెక్స్ రొడ్రిగ్స్‌తో సహజీవనం చేశారు. తాజాగా బెన్ అఫ్లెక్‌తో మళ్లీ డేటింగ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X