నా ఫ్యామిలి తో గడపడానికే టైమ్ లేదు..!
తెలుగులో ఒక సాంగ్ వుంది అదేంటంటే 'జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టువుందిరో ఈ సుందరి అని' దీని అర్దం ఏమిటంటే ఆమె అంత అందంగా ఉంటుంది మరి. జెన్నిఫర్ లోపెజ్ మంచి హీరోయినే కాదు మంచి సింగర్ కూడా. 2003లో అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ ఫర్ రాక్ ఫీమెల్ ఆర్టిస్ట్ అవార్డుని, 2007లో అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ ఫర్ ఫెవరేట్ లాటిన్ ఆర్టిస్ట్ అవార్డుని సోంతం చేసుకున్నారు.
ఇటీవల కాలంలో ఈ అమ్మడు తన ఫ్యామిలి తో గడపడానికి టైమ్ లేదని తెగ బాధ పడుతుంది. జెన్నిఫర్ లోపెజ్ కి మాక్స్ అండ్ యమ్మిఅనే ఇద్దరు కవల పిల్లలు. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను మదర్ కి పిల్లలతో ఆడుకోవడానికి టైమ్ లేదంటే. మదర్ గా నేను నా బాద్యతలను నా పిల్లలతో సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను అని తన మనోభావాలను వెల్లడించారు. ఈ 41 సంవత్సరాల నయసుగల సుందరి తను సినిమాలలో మ్యూజిక్ ఆల్బమ్స్ లో పాల్గోనేటప్పుడు ఏ కోంచెం ఖాళీ సమయం దోరికిన తన పిల్లలతో గడపడానికి ఇష్టపడతానని అంటోంది. ప్రస్తుతం నా ఆలోచన అంతా నా పిల్లపైనే ఉంది అంటూ తన గురించి తాను చెప్పకోచ్చింది.


Click it and Unblock the Notifications











