»   » ప్రస్తుతం నేను సింగిల్: తేల్చి చెప్పిన హాట్ బ్యూటీ

ప్రస్తుతం నేను సింగిల్: తేల్చి చెప్పిన హాట్ బ్యూటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్...తన ప్రియుడు కాస్పర్ స్మార్ట్‌తో కలిసిందనే వార్తలు ఇటీవల వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఓ బలమైన కారణం కూడా ఉంది. ఇద్దరూ లిప్ టు లిప్ ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి బయటకు రావడమే ఇందుకు కారణం.

ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెను మీడియా వారు ప్రశ్నించగా...‘ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నా, థాంక్యూ' అంటూ నవ్వుతూ మీడిడియాకు సమాధానం ఇచ్చింది. మరి ఆ ముద్దు సంగతేమిటి అంటే మాత్రం స్పందించడం లేదు. కాస్పర్ స్మార్ట్ తో జెన్నిఫర్ లోపెజ్ దాదాపు మూడేళ్లు డేటింగ్ చేసింది. గతేడాది ఇద్దరూ విడిపోయారు.

Jennifer Lopez Is Single, Laughs Off Dating Rumours With Casper Smart

జెన్నిఫర్ లోపెజ్ గురించిన ఇతర విషయాల్లోకి వస్తే... ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు సైతం తీసుకున్న జెన్నిఫర్ గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటోంది. ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ తో ప్రేమాయణం ఆమెకు ఒంటరి తనాన్నిదూరం చేసింది. ఆ మధ్య వీరు పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే గతేడాది సమ్మర్లోనే వీరు విడిపోయారు. ఈ మధ్య ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరగడం, ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయింది. అయితే జెన్నిఫర్ మాత్రం తాను ఒంటిరినే అంటోంది.

సంపాదన అదుర్స్... హాలీవుడ్ నటి, అమెరికన్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ గురించి, ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు(2500 కోట్లు). అయినప్పటికీ డబ్బు సంపాదించడానికి వచ్చి ఏ ఆఫర్ కూడా ఆమె వదులుకోవడం లేదు.

English summary
We can't get what is going on with Jennifer Lopez. Once she says she is single and then she is snapped with her on-again and off-again boyfriend, Casper Smart.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu