కాలుజారిన పాప్ తార
ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని నోకియా థియేటర్ లో అమెరికన్ మ్యూజిక్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యూజిక్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ పాప్ తార జెన్నిఫర్ లోపెజ్ నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ఫర్ఫార్మెన్స్ లో ఒకానొక సందర్భంలో ఆమె డ్యాన్స్ చేస్తూ కాలు జారిపడ్డారు. కానీ వెంటనే తేరుకొని ప్రదర్శనను కొనసాగించారు.
ఈ విషయమై ఇటీవల ఓ రేడియో ఇంటర్యూలో అడుగగా "అవునా నేను కిందపడ్డానా!! అయినా అది పడటం కాదు, నృత్యంలో ఓ భఆగం మాత్రమే అని నవ్వేసిందట". ఇకనైనా విమర్శకులు తను ఏవిధంగా కింద పడ్డా కవర్ చేసానో తెలుసుకోండని, తనపై విమర్శలు చెయ్యకండని తెలిపింది. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా జెన్నిఫర్ లోపెజ్ తో పాటు లేడీ గాగా, రిహాన్నా, షకీరా తదితరులు ఇచ్చిన ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.
టేలర్ స్విఫ్ట్ మైఖేల్ జాక్సన్ అమెరికా లాస్ ఏంజిల్స్ అమెరికన్ మ్యూజిక్ అవార్డులు జెన్నిఫర్ లోపెజ్ jennifer lopez taylor swift michael jackson america music awards jermaine jackson hollywood


Click it and Unblock the Notifications