ప్రెసిడెంట్‌తో వైట్ హౌస్‌లో సూపర్ బౌల్ పార్టీకి ఆహ్వానం అందుకున్న జంట
ప్రముఖ అమెరికా పాప్ సింగర్ మరియు హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్ తన భర్త మార్క్ ఆంటోనీ ఈసంవత్సరం వైట్ హౌస్‌లో జరగనున్న సూపర్ బౌల్ పార్టీకి గెస్టులుగా ఆహ్వానం పోందారని వైట్ హౌస్‌కు సంబంధించినటువంటి అధికారులు వెల్లడించారు. ఈసందర్బంలో జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ మాకు ఈఆహ్వానాన్ని పంపండం నన్ను చాలా ఆశ్చర్యంలోకి గురిచేసిందన్నారు. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సూపర్ బౌల్ పార్టీలో పోల్గోనాలని చాలా మందికి ఉంటుంది. అది కూడా వైట్ హౌస్‌లో జరుగుతున్న కార్యక్రమానికి..నాఆనందానికి అవధులు లేకుండా పోయాయని అన్నారు.
నేను అస్సులు దీనిని నిజంగా నమ్మలేక పోతున్నాను అని అన్నారు. ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్ అమెరికన్ ఐడియల్‌లో జడ్జిగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. అమెరికన్ ఐడియల్ జడ్జిగా వ్యవహారిస్తున్న తీరుని బట్టే నాకు ఈఅవకాశం లభించి ఉంటుందని అనుకుంటున్నాను అన్నారు. అంతేకాకుండా అక్కడ జరగనున్న వైట్ హౌస్ సూపర్ బౌల్ పార్టీలో దీని గురించి మాట్లాడాల్సి వస్తుందేమోనని అనుకుంటున్నానని అన్నారు. ఇప్పటికీ కూడా దీనిని నేను నమ్మలేకపోతున్నాను అని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ వైట్ హౌస్ సూపర్ బౌల్ పార్టీకి నన్ను ఆహ్వానించినందుకు వైట్ హౌస్ అధికారులకు మరియు ప్రెసిడెంట్‌కి నాకృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











